అన్వేషించండి

AP DSC Recruitment: పండుగలా కొత్త టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు - గురువారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేడుక

Mega DSC Appointment Letters: మెగా డీఎస్సీ నియామక పత్రాల అందజేత కార్యక్రమం గురువారం జరగనుంది. సీఎం, డిప్యూటీసీఎంతో పాటు మంత్రులు,ఎమ్మెల్యేలు అందరూ హాజరు కానున్నారు.

AP DSC appointment letter distribution ceremony:  ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిర్వహించిన  మెగా డీఎస్సీ నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 25 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన విశాలమైన వేదిక మీద ఈ కార్యక్రమం జరగనుంది.  ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్  ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు.   16,347 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.           

అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దానికి తగ్గట్లుగా ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఇచ్చారు.  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు చంద్రబాబు నాయుడు సంతకం చేసిన మొదటి ఫైల్ మెగా డీఎస్సీ.  5.7 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసిన ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సజావుగా పూర్తయింది. సెప్టెంబర్ 12న ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదలైంది.  ఇందులో 15,941 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.  మిగిలిన 406 పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు లేకపోవడంతో తదుపరి డీఎస్సీలో భర్తీ చేస్తారు. డీఎస్సీని ఆపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కి పైగా కేసులు వేసినా, ఒక్క కేసు కూడా స్టే కాలేదని, ప్రక్రియ మాత్రమే ఫూల్‌ప్రూఫ్‌గా జరిగిందని మంత్రి లోకేష్ అసెంబ్లీలో పేర్కొన్నారు.                   

సెప్టెంబర్ 19న జరగాల్సిన ఈ కార్యక్రమం భారీ వర్షాలవల్ల వాయిదా పడింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో హాజరు కానున్నారు. విపక్షాలు సహా అందరికీ ఆహ్వానం పంపారు. ఎంపికైన 16 వేల మంది డీఎస్సీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు కూడా హాజరవుతారు. కొత్త టీచర్లలో మహిళలు 49.9 శాతం అంటే సుమారు 7,000 మంది  ఎంపికైనట్లు తెలియచేస్తున్నాయి.                

సచివాలయం వెనుక పెద్ద సభా మండపం, స్టేజ్, లైటింగ్, సౌండ్ సిస్టమ్‌లు  ఏర్పాటు చేశారు.  అభ్యర్థులకు ప్రత్యేక ఆహ్వాన పత్రాలు పంపారు, ఇది కూటమి ప్రభుత్వానికి గర్వకారణమని లోకేష్ అన్నారు.  గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా జరగకపోవడాన్ని విమర్శిస్తూ, మా ప్రభుత్వం 150 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసిందని లోకేష్ గుర్తు చెబుతున్నారు.                      

 

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
Bhogapuram Airport: ఉత్తరాంధ్రలో సరికొత్త అధ్యాయం.. నేడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఉత్తరాంధ్రలో సరికొత్త అధ్యాయం.. నేడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Anna Konidala Adopts Elephant Tiger: పుట్టినరోజున బిగ్ హార్ట్ - విశాఖ జూలో ఏనుగు, పులిని దత్తత తీసుకున్న అన్నా కొణిదెల
పుట్టినరోజున బిగ్ హార్ట్ - విశాఖ జూలో ఏనుగు, పులిని దత్తత తీసుకున్న అన్నా కొణిదెల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget