దేశవ్యాప్తంగా 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.90 కోట్లు ఎస్‌బీఐ ఆశా స్కాలర్ షిప్



తొమ్మిదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ స్థాయిల్లో చదివే విద్యార్థులకు వర్తింపు



స్కూల్ స్టూడెంట్స్ 75% మార్కులు లేదా 7.0 సీజీపీఏ సాధించాలి (SC/STకు 10% సడలింపు: 67.5% లేదా 6.3 సీజీపీఏ). కుటుంబ వార్షిక ఆదాయం ₹3 లక్షలకు మించకూడదు.



అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) స్టూడెంట్స్ గత సంవత్సరంలో 75% మార్కులు సాధించాలి (SC/ST సడలింపు). కుటుంబ ఆదాయం రూ. 6 లక్షలకు మించకూడదు.



అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) స్టూడెంట్స్ గత సంవత్సరంలో 75% మార్కులు సాధించాలి (SC/ST సడలింపు). కుటుంబ ఆదాయం రూ. 6 లక్షలకు మించకూడదు.



మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ కోర్సులు విదేశాల్లో చదివే వారికి లేదా అక్కడ అడ్మిషన్ ఆఫర్ పొందినవారికి కూడా ఇస్తారు.



ఏటా ₹15,000 నుంచి ₹20 లక్షల వరకు కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్ షిప్ రెన్యూవల్. విద్యార్థులు కనీస అర్హత మార్కులు సాధించాలి.



స్కూల్ స్టూడెంట్స్: ₹15,000 . UG/PG ₹50,000 నుంచి ₹70,000, . మెడికల్/ఐఐటీ/ఐఐఎం/ఓవర్‌సీస్: ₹20 లక్షల వరకు స్కాలర్ షిప్



అధికారిక వెబ్‌సైట్: www.sbiashascholarship.co.in లేదా www.buddy4study.com/page/sbi-asha-scholarship-program ద్వారా అప్లై చేయాలి.



అకడమిక్ మెరిట్, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా ఇనిషియల్ షార్ట్‌లిస్టింగ్. షార్ట్‌లిస్టెడ్ క్యాండిడేట్స్‌తో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది.