YSRCP Digital Book: టీడీపీది రెడ్ బుక్ అయితే వైసీపీది డిజిటల్ బుక్ - ప్రారంభించిన జగన్ - కార్యకర్తలే రాసుకోవచ్చు !
Digital book: వైఎస్ఆర్‌సీపీ డిజిటల్ బుక్ ను జగన్ ప్రారంభించారు. వేధింపులకు గురవుతున్న కార్యకర్తలు అందరూ తమ పేర్లను అందులో నమోదు చేసుకోవచ్చు.

Jagan launches YSRCP digital book: అన్యాయాలు, రాజకీయ హింసకు గురైన బాధితులకు అండగా నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రారంభించారు. ఆన్‌లైన్ పోర్టల్ (https://digitalbook.weysrcp.com/auth/phone) ద్వారా కార్యకర్తలు, నాయకులు తమ ఎదుర్కొన్న అన్యాయాలను నేరుగా డాక్యుమెంట్ చేసుకోవచ్చు. అలాగే్ 040-49171718 టోల్ ఫ్రీ IVRS కాల్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. "ప్రతి అన్యాయాన్ని శాశ్వత డిజిటల్ డైరీలో నమోదు చేసి, భవిష్యత్తులో SIT దర్యాప్తుకు ఆధారంగా ఉపయోగపడేలా చేస్తాం" అని జగన్ ప్రకటించారు. ఈ పోర్టల్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పరిమితం కాకుండా, రాజకీయ బాధితులకు కూడా సహాయం అందించేలా రూపొందిచామని చెప్పారు. .
అమరావతిలో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో వైయస్ఆర్సీపీ డిజిటల్ బుక్ అధికారిక వెబ్‌సైట్‌పై ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. "మా కార్యకర్తలు ఎదుర్కొన్న అన్యాయాలు మరచిపోకూడదు. ప్రతి సంఘటనను డిజిటల్‌గా భద్రపరిచి, న్యాయం కోసం పోరాడతాం" అని జగన్ చెప్పారు. అన్యాయాలను డాక్యుమెంట్ చేయడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవాలని జగన్ సూచించారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, ఈ డేటాను ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
🚨 #YSRCPDigitalBook
— YSR Congress Party (@YSRCParty) September 24, 2025
వైయస్ఆర్సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ యాప్‌ను లాంచ్ చేసిన వైయస్ జగన్ గారు
వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై విచారణ. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని వైయస్ జగన్ గారు హామీ
Today, the… pic.twitter.com/KVrofcclW1
https://digitalbook.weysrcp.com/auth/phone అడ్రస్‌లో అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ 'We YSRCP - Digital Book' పేరుతో రూపొందించారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆథెంటికేషన్ చేసుకుని రిజిస్టర్ అవ్వవచ్చు. కార్యకర్తలు తమ ఎదుర్కొన్న అన్యాయాలు, రాజకీయ హింసలు, ఫిర్యాదుల వివరాలను ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లతో సహా నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు. ప్రతి సంఘటనను శాశ్వతంగా డిజిటల్ డైరీలో నమోదు చేసి భద్రపరుస్తారు. ఇది భవిష్యత్తు చట్టపరమైన చర్యలకు ఆధారంగా ఉపయోగపడుతుంది. ఆథెంటికేషన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే యాక్సె ఉంటుంది. ప్రాసెస్ తర్వాత యూజర్ డ్యాష్‌బోర్డ్‌కు ప్రవేశం లభిస్తుంది, ఇక్కడ ఫిర్యాదులు ట్రాక్ చేసుకోవచ్చు.
పోర్టల్‌తో పాటు 040-49171718 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా IVRS (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌కు కాల్ చేసి యూజర్ తమ వివరాలు, అన్యాయాలు వాయిస్ రికార్డింగ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఫిర్యాదు రిఫరెన్స్ నంబర్ ఇస్తుంది. ఈ రెండు సౌకర్యాలు కలిసి పార్టీ కార్యకర్తలకు 24/7 సపోర్ట్ అందిస్తాయి. "ఇది మా పార్టీని మరింత బలోపేతం చేస్తుంది" అని జగన్ అన్నారు.
టీడీపీ ప్రభుత్వం వచ్చాక తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో డిజిటల్ బుక్ ద్వారా అఆ అన్యాయాలను నమోదు చేసుకుంటున్నారు.





















