Sports Tales | గ్యాంగ్‌స్టర్స్‌ని జెంటిల్‌మెన్‌గా మార్చిన క్రికెట్ | ABP Desam
క్రికెట్ అంటే జెంటిల్‌మెన్స్ గేమ్. కానీ అదే క్రికెట్‌ని గ్యాంగ్ స్టర్స్ ఆడితే? లైఫ్ అంటే ఏంటో మర్చిపోయి.. కత్తులు, గన్స్ పట్టుకుని రాబరీలు, కిడ్నాప్‌లు, మర్డర్లు చేస్తూ పూర్తిగా చీకటి జీవితం గడుపుతున్న మనుషులకి.. క్రికెట్.. ఓ కొత్త వెలుగుని చూపించి.. వాళ్ల జీవితానికి కొత్త అర్థాన్నిచ్చి.. ప్రపంచం ముందు రెస్పెక్ట్‌ఫుల్ సిటిజన్స్‌గా నిలబెట్టిందంటే.. ఓ క్రికెట్ ఫ్యాన్‌గా ఇంతకంటే ప్రౌడ్ మొమెంట్ ఏముంటుంది? మరి లాస్ ఏంజెల్స్‌లోని అలాంటి డోమ్ టౌన్ అనే ఊరి చరిత్రని, ఆ ఊరున్న కాంప్టన్ అనే సిటీ కథని క్రికెట్ ఎలా మార్చిందో ఈ రోజు స్పోర్ట్స్ టేల్స్‌లో చూద్దాం.హాయ్ అండ్ వెల్‌కమ్ టూ స్పోర్ట్స్ టేల్స్. 1980sలో యూఎస్‌లోని లాస్ ఏంజెల్స్ సిటీ క్రైమ్‌కి, క్రిమినల్ గ్యాంగ్స్‌కి పెట్టింది పేరు. ఆ సిటీలో ఉండే కాంప్టన్ టౌన్ గ్యాంగ్‌స్టర్లకి అడ్డాగా ఉండేది. అడుగడుగునా రాబరీలు, దొంగతనాలు, డ్రగ్స్, కిడ్నాప్‌లు, ఎటు చూసినా గ్యాంగ్‌స్టర్లతో నిండిపోయి.. కామన్ పీపుల్ బతకడానికే వీల్లేకుండా ఉండేది. దీనికి తోడు డౌన్‌టౌన్‌లో పేదలు, హోమ్‌లెస్ పీపుల్ ఎక్కువగా ఉండేవాళ్లు. వీళ్లకి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా ఉండేవి కాదు. అలాంటి టైంలో నిజంగా దేవుడే పంపించినట్లు వాళ్లకోసం వచ్చాడు టెడ్ హేయర్స్. ఫిల్మ్ ప్రొడ్యూసర్ కేటీ హేబర్‌తో కలిసి.. దాదాపు 10, 15 ఏళ్ల పాటు అక్కడి హోమ్‌లెస్ పీపుల్ కోసం పోరాడి.. 90స్ కల్లా వాళ్లందరికీ ఓ డోమ్ సిటీని రెడీ చేయించాడు. ఈ ఊళ్లో ఇళ్లన్నీ చాలా చిన్నగా, గుడారాల్లా చూడ్డానికే విచిత్రంగా ఉంటాయి. అయితే అప్పటివరకు ఇళ్లు లేకుండా రోడ్లపై బతికిన నిరాశ్రయులకి అదే పెద్ద ఇంద్రభవనంలా కనిపించింది. అందరూ ఆ డోమ్ హౌసెస్‌లో హ్యాపీగా ఉండటం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ల క్రైం లైఫ్ మాత్రం మారలేదు. అలాంటి టైంలో టెడ్ హేయర్స్ బాగా ఆలోచించి.. వాళ్లకి క్రికెట్‌ని పరిచయం చేశాడు.





















