ICC Champions Trophy: మెగాటోర్నీకి భారత్ సహా ఏడు జట్ల ప్రకటన.. టీమ్ ప్రకటనలో ఆతిథ్య పాక్ తాత్సారం..
ICC Champions Trophy:ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని చివరిసారిగా 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ నెగ్గింది. 2017లో ఫైనల్ కు చేరినా పాక్ చేతిలో ఓటమిపాలైంది.

ICC Champions Trophy: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును శనివారం ప్రకటించారు. దీంతో టోర్నీలో ఏడు జట్లను ప్రకటించినట్లయ్యింది. అయితే ఆతిథ్య పాక్ మాత్రం ఇప్పటివరకు జట్టును ప్రకటించలేదు. కొన్ని కారణాల వల్ల టీమ్ సెలెక్షన్ పై ఐసీసీ నుంచి కాస్త సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టోర్నీలో పాక్ లో జరుగుతున్నప్పటికీ భారత్ మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతాయి. ఈ టోర్నీని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఆడనున్నాయి. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్గనిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇరుజట్లలో లీగ్ దశ ముగిశాక టాప్ టూలో నిలిచిన నాలుగు జట్లు నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తాయి. వచ్చేనెల 19న న్యూజిలాండ్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ తో టోర్నీ ఆరంభమవుతుంది. తర్వాత రోజు దుబాయ్ లో బంగ్లాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఫిబ్రవరి 23న పాక్ తో, మార్చి 2న న్యూజిలాండ్ తో భారత్ ఆడుతుంది. చాంపియన్స్ ట్రోఫీకి స్వ్కాడ్లను ప్రకటించిన జట్ల వివరాలు
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వీస్ జస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.
ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టు:
నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజీద్ హసన్, తౌహీద్ హృదయోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జెకర్ అలీ అనిక్, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, ఇహ్మద్‌సన్ హుస్సేన్, ఇహ్మద్సన్ హుస్సేన్, నహిద్ రానా.
ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిాలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్ ,విల్ యంగ్.
ఆఫ్గానిస్థాన్ జట్టు:
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎం గజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫజద్ మఖ్విల్, ఫజల్‌హారీ.
ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా.
దక్షిణాఫ్రికా జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ర్యాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, తబ్రిజ్ షమ్సీ, కగిసో రబాడ , వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, లుంగి ఎన్గిడి.




















