అన్వేషించండి
Hebah Patel: 'సందేహం' ఏముందబ్బా... హెబ్బా ఉంటే ట్రెండింగ్‌లోకి వస్తుందిగా
Sandeham OTT Streaming: హెబ్బా పటేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల కొన్ని సినిమాలు పాపులారిటీ దక్కుతోంది. అందులో కథ బావుంటే ఆ మూవీ ట్రెండ్ కూడా అవుతుంది. అందుకు ఉదాహరణ 'సందేహం'.
ఓటీటీలోకి కొత్తగా వచ్చిన హెబ్బా పటేల్ సినిమా ఏదో తెలుసా?
1/4

Hebah Patel New Movie On OTT: హీరోయిన్ హెబ్బా పటేల్ గ్లామర్ ఇమేజ్ ఉన్న హీరోయిన్. ఆవిడ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల కొన్ని సినిమాలకు ప్రచారం రావడం కాదు... ఆయా సినిమాల్లో కథ బావుంటే ట్రెండ్ లోకి వస్తున్నాయి. అందుకు 'సందేహం' సినిమా రీసెంట్ ఎగ్జాంపుల్. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సందేహం'. ఇందులో సుమన్ వూట్కూరు హీరో. 'ఊరికి ఉత్తరాన' ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో విష్ణు వర్షిణి క్రియేషన్స్ పతాకం మీద సత్యనారాయణ పర్చా నిర్మించిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల అయ్యింది. ప్రజెంట్ ఈ మూవీ ఆ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.
2/4

లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్‌గా 'సందేహం' సినిమా తెరకెక్కింది. ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలోకి ఈ సినిమా వచ్చింది. ఓటీటీలోనూ సందేహం సినిమాకు రెస్పాన్స్ చాలా బావుందని దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
3/4

'సందేహం' సినిమాలో హెబ్బా పటేల్ కొత్త పెళ్ళైన అమ్మాయిగా కనిపించారు. పెళ్లి జరిగిన కొన్నాళ్లకు భర్త మరణిస్తే, ఆ తర్వాత ఆ మరణం వెనుక మిస్టరీ ఉందని కొందరు భావిస్తే... తర్వాత ఏమైంది? అనేది సినిమా కథ.
4/4

'సందేహం' సినిమాకు మంచి ఆదరణ లభించడంతో పాటు హెబ్బా పటేల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ వారం ఓటీటీల్లో విడుదలైన సినిమాలు అన్నిటిలోకెల్లా 'సందేహం' ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుని ఈటీవీ విన్ యాప్ ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోందని వారు చెప్పారు. 'సందేహం'లో శ్వేతా వర్మ, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Published at : 01 Dec 2024 05:01 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















