Viral Video :ఒక అరటి పండు రూ. 100, సమోసా రూ. 40, హైదరాబాద్ వ్యాపారుల వీడియోలు వైరల్
Viral Video : ఓ విదేశీ యాత్రికుడిని మోసం చేద్దామనుకున్న హైదరాబాద్ వీధి వ్యాపారుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ టూర్‌లో మంచి వారిని కూడా కలిసినట్టు ఆ ట్రావెలర్ చెప్పుకొచ్చాడు

Viral Video : హైదరాబాద్... చాలా మందికి ఫేవరేట్ డెస్టినేషన్. ఇక్కడ టూరిజం ఎంత ఫేమస్సో, ఫుడ్ అంతకంటే ఫేమస్. అలాంటి వాటి కోసం ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. వారిలో ఇతర్రాష్ట్రాల వారు ఉంటారు. విదేశీయులు కూడా ఉంటారు. అలా హైదరాబాద్ చూసి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్‌ను రుచి చూద్దామని వచ్చిన ఓ ట్రైవెల్ ఇన్‌ఫ్లూయన్సర్‌ను మోసం చేయబోయారో ఇద్దరు వ్యాపారులు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
hello@hughabroad.com పేరుతో ట్రావెల్ వీడియోలు చేసే ఓ స్కాట్‌లాండ్ వ్యక్తి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ వచ్చాడు. చాలా ప్రాంతాలు తిరుగుతూ అక్కడ పర్యాటకంతోపాటు ఇక్కడ ఉండే ఫుడ్‌ను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఫేమస్ టూరిస్ట్ ప్రదేశాలను తిరుగుతూ అక్కడ ఉండే ఫుడ్‌ను టేస్టు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. హైదరాబాద్‌లో కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. చాలా ప్రాంతాలను తిరిగాడు.
చార్మినార్, కోఠీ సికింద్రాబాద్ అన్ని ప్రాంతాలను చుట్టేశాడా వ్యక్తి. కనిపించిన స్ట్రీట్ ఫుడ్‌ను టేస్టు చేశాడు. ఇలా తిరుగుతున్న టైంలో ఇద్దరు వ్యాపారులు ఆ విదేశీయుడికి ఝలక్ ఇచ్చారు. అందులో మొదటి వ్యక్తి అరటి పండ్ల వ్యాపారి. విదేశీయుడు వెళ్తూ వెళ్తూ తన వైపు వస్తున్న తోపుడు బండిపై అరటి పండ్లు పెట్టి అమ్ముతున్న వ్యక్తిని చూశాడు. అటుగా వెళ్లి పండ్లు ఎంత అని అడిగాడు. సాధారణంగా హైదరాబాద్‌లో డజన్ లెక్కలు చెబుతుంటారు.
View this post on Instagram
ఫారినర్ అడిగిన వెంటనే తడుముకోకుండా వంద రూపాయలు అని చెప్పాడు వ్యాపారి. మరోసారి ఎంతా అని విదేశీ ట్రావెలర్ అడిగాడు. అదే సమాధానం వచ్చింది. ఒక అరటి పండు ఎంతా అంటూ చేయి చూపించి అడిగాడు. మళ్లీ హండ్రెడ్ అనే సమాధానం వచ్చింది. ఆశ్చర్యపోయిన విదేశీ యాత్రికుడు ఒక అరటి పండు చూపించి ఎంత అని అడిగాడు. వంద అని అదే ఫ్లోలో చెప్పాడు వ్యాపారి. ఱమ్మో ఇక్కడ చాలా కాస్ట్లీ అంటూ చెప్పి ఆశ్చర్యపోయాడు విదేశీయుడు.
View this post on Instagram
అలా చాలా ప్రాంతాలు తిరుగుతున్న టైంలో ప్లేట్‌లో సమోసాలు అమ్ముతున్న వ్యక్తి కనిపించాడు. ఆయన్ని ఆపి అవి ఏంటని అడిగాడు. సమోసా అన్నాడు. ఎంత అంటే 30 రూపాయలు అని చెప్పాడు. ఒకటి మాత్రం చాలని చెప్పడంతో 40 రూపాయలు అని సమాధానం చెప్పాడు. వెంటనే ఆ విదేశీయ ట్రావెలర్ 40 రూపాయలు అతని చేతిలో పెట్టి సమోసా తీసుకున్నాడు. అతి తిన్న తర్వాత అంత గొప్పగా లేదని యావరేజ్ రేటింగ్ ఇచ్చాడు.
మరో చోట కబాబ్స్ తీసుకున్న పారినర్... టేస్టుకు ఫిదా అయిపోయాడు. కానీ పరిశుభ్రంగా లేదని రేటింగ్ ఇవ్వలేదు. తను తిన్న బోటీ కబాబ్‌లో ఏదో ప్లాస్టిక్ వస్తువు వచ్చింది. ఆ విషయాన్ని కూడా రివ్యూలో చెప్పాడు. మరో చోట్ కార్న్స్ తింటున్న టైంలో తలవెంట్రుక వచ్చింది. అప్పుడు కూడా కామెంట్స్ చేశాడు.
ఈ టూర్‌లో చాలా మంది టేస్టు కోసం ఫుడ్ ఇచ్చి డబ్బులు తీసుకోలేదు. కేవలం సెల్ఫీ తీసుకొని వదిలేశారు. ఆవిషయాన్ని కూడా ఈ ఇన్‌ఫ్లూయన్సర్ తన రివ్యూల్లో చెప్పుకొని వచ్చాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

