Divyabharathi: తమిళ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీతో డేటింగ్... మరోసారి బాంబు పేల్చిన దివ్యభారతి
Divyabharathi On Dating Rumors: సంగీత దర్శకుడు హీరో జీవీ ప్రకాష్ కుమార్, హీరోయిన్ దివ్యభారతి ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా రోజులుగా తమిళ సినీ వర్గాలలో వినబడుతున్నాయి. వీటిపై దివ్యభారతి స్పందించారు.

Divyabharathi GV Prakash Kumar News: సంగీత దర్శకుడు, కథానాయకుడు జీవీ ప్రకాష్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా మొదట భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయమైనా... ఆ తర్వాత తన సంగీతంతో, నటనతో అందరిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తోంది. అందుకు విడాకులు, విడాకులకు దివ్యభారతి కారణం అంటూ జరిగే ప్రచారమే. జీవీతో తనను ముడిపెడుతూ వరుస కథనాలు వస్తుండడంతో దివ్యభారతి సోషల్ మీడియా వేదికగా బాంబు పేల్చారు.
నటుడితో ఎప్పుడూ డేటింగ్ చేయను!
Divyabharathi Instagram Story On Dating Rumours: ''నేను ఎప్పుడూ ఒకరు నటుడితో డేటింగ్ చేయను, అందులోనూ పెళ్లయిన వ్యక్తితో అసలు డేటింగ్ చేయను'' ఇంస్టాగ్రామ్ స్టోరీలో దివ్యభారతి పోస్ట్ చేసిన మ్యాటర్లో ముఖ్యమైన అంశం ఇది. ఇప్పటి వరకు తాను మౌనంగా ఉన్నానని, అయితే నిరాధారమైన ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయని గీత దాటి మరి కథనాలు వండుతున్నారని ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవీ కుటుంబ సమస్యలతో సంబంధం లేదు!
జీవీ ప్రకాష్ కుమార్ వ్యక్తిగత కుటుంబ సమస్యలతో తనకు సంబంధం లేదని దివ్యభారతి స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండానే తన పేరును ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి లాగుతున్నారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం బదులు మెరుగైన సమాజాన్ని నిర్మిద్దామని గాసిప్ రాయుళ్లకు ఆవిడ సలహా ఇచ్చారు. తాను స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అని, ఒక గాసిప్ తన వ్యక్తిత్వాన్ని నిర్వచించలేదని తెలిపారు. ఇకపై దీని గురించి (జీవీ ప్రకాష్ కుమార్ డేటింగ్ రూమర్స్) తాను స్పందించేది లేదని, ఇదే తన ఫస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్ అని దివ్యభారతి స్పష్టం చేశారు.
Also Read: మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా బావుందా? లేదా?
జీవీ ప్రకాష్, దివ్యభారతి... ఎందుకు డేటింగ్ రూమర్స్?
'బ్యాచిలర్' సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్ సరసన దివ్యభారతి హీరోయిన్ రోల్ చేశారు. అందులో ఇద్దరికీ కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో జీవీ వ్యక్తిగత జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తన భార్యకు ఆయన విడాకులు ఇచ్చారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నట్లు, భార్యాభర్తలుగా వేరుపడినా స్నేహితులుగా కలిసి ఉంటామని చెప్పారు. 'బ్యాచిలర్' తరువాత 'కింగ్స్టన్' సినిమాలో జీవీ, దివ్యభారతి జంటగా నటించారు. దాంతో వాళ్ళిద్దరి మధ్య డేటింగ్ ఉందని ప్రచారం బలంగా మొదలైంది.
Also Read: చైనా పీస్ - ఇదొక సినిమా గురూ... వాలిగా నిహాల్ కోధాటి - ఇంటెన్స్ ఫస్ట్ లుక్ చూశారా?
'కింగ్స్టన్' ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన సమయంలో దివ్యభారతితో డేటింగ్ వార్తలను జీవీ ప్రకాష్ కుమార్ కొట్టిపారేశారు. సినిమాలో మాత్రమే కలిసి నటించామని, తమ మధ్య ఏమీ లేదని ఆయన చెప్పారు ఇప్పుడు దివ్యభారతి ఆ వార్తల పట్ల స్పందించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

