China Piece Movie: చైనా పీస్ - ఇదొక సినిమా గురూ... వాలిగా నిహాల్ కోధాటి - ఇంటెన్స్ ఫస్ట్ లుక్ చూశారా?
Nihal Kodhaty Movie: నిహాల్ కోధాటి హీరోగా నటిస్తున్న సినిమా 'చైనా పీస్'. సూర్య శ్రీనివాస్ మరొక హీరో. అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఇందులో నిహాల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'బటర్ ఫ్లై' గుర్తు ఉందా? ఆ సినిమాలో హీరో ఎవరో గుర్తు ఉందా? ఆ అబ్బాయి పేరు నిహాల్ కోధాటి (Nihal Kodhaty). ఎన్టీఆర్ 'దేవర పార్ట్ 1'లో కీలక పాత్ర చేశారు. 'టుక్ టుక్'లో యాక్ట్ చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చైనా పీస్'. ఉగాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'చైనా పీస్'... ఇదొక సినిమా గురూ!
'చైనా పీస్' సినిమాలో నిహాల్ కోధాటి ఒక హీరో కాగా... సూర్య శ్రీనివాస్ మరొక హీరో. ఈ చిత్రానికి అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాదు... మూన్ లైట్ డ్రీమ్స్ సంస్థలో ఆయన స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కమల్ కామరాజు, రఘు బాబు, 'రంగస్థలం' మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రధారులు.
'చైనా పీస్' సినిమాలో వాలి పాత్రలో నిహాల్ కోధాటి నటిస్తున్నట్టు దర్శక నిర్మాత తెలిపారు. ఆయన ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇదొక స్పై థ్రిల్లర్ అని అక్కి విశ్వనాథ రెడ్డి చెప్పడంతో నిహాల్ కోధాటి లుక్ మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
Also Read: మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా బావుందా? లేదా?
View this post on Instagram
'చైనా పీస్' చిత్రీకరణ పూర్తి అయ్యిందని, త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని అక్కి విశ్వనాథ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, నిర్మాణ సంస్థ: మూన్ లైట్ డ్రీమ్స్, రచన - దర్శకత్వం: అక్కి విశ్వనాథ రెడ్డి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

