అన్వేషించండి

Dhurandhar 3: 'ధురంధర్ 3' ఉంటుందా? రణవీర్ సింగ్‌తో ఆదిత్య ధర్ మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?

Dhurandhar The Revenge Sequel: 'ధురంధర్ 3' ఉంటుందా? 'ధురంధర్: ది రివెంజ్' తర్వాత మరొక సీక్వెల్ చేయడానికి దర్శకుడు ఆదిత్య ధర్ సిద్ధమవుతున్నారా? బాలీవుడ్ మీడియా ఏమంటోంది? అంటే...

'ధురంధర్: ది రివెంజ్' సినిమాపై అభిమానులలో చాలా ఆసక్తి ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు... సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 18న ప్రీమియర్స్ కోసం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. గురువారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ బాక్స్‌ ఆఫీస్ చరిత్రలో 'ధురంధర్ 2' అతి పెద్ద ఓపెనింగ్ డే, వీకెండ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా మారవచ్చని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. వీటన్నిటి మధ్య, 'ధురంధర్: ది రివెంజ్' తర్వాత మూడవ భాగం కూడా వస్తుందని, వచ్చే ఛాన్స్ ఉందని బాలీవుడ్ టాక్. 

'ధురంధర్ ది రివెంజ్' తర్వాత 'ధురంధర్ 3'? 
జియో స్టూడియోస్ ఆదిత్య ధర్‌ (Adhitya Dhar)ను 'ధురంధర్ 3' స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించమని కోరిందట. నిర్మాణ సంస్థ ఈ ఫ్రాంచైజీని పెద్ద సినిమాటిక్ యూనివర్స్‌గా మార్చడానికి అవకాశాలను చూస్తోంది. అయితే ఆదిత్య ధర్ ఈ కథతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? అనేది ఇంకా తెలియదు. "ఈ కథను అనేక భాగాలుగా చేయగలిగే అవకాశం ఉంది. ధురంధర్ సృష్టించిన వసూళ్ల సునామీ, కథతో పాటు నటీనటుల ప్రతిభకు, సినిమాకు వచ్చిన స్పందన చూస్తే... మూడో భాగాన్ని వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేం" అని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Jaripey Naatho Pandaga Song Lyrics: జరిపేయ్ సాంగ్ లిరిక్స్... కాంట్రవర్సీకి కారణమైన 'కేడీ'లో నోరా ఫతేహి - సంజయ్ దత్ పాట

ఆదిత్య ధర్ మనసులో కూడా మూడో పార్ట్ గురించి ఓ ఆలోచన ఉందట. అయితే... ఆయన కచ్చితంగా ఏమీ చెప్పడం లేదు. ప్రస్తుతం జియో స్టూడియోస్ మాత్రం ఈ అవకాశాన్ని కోల్పోకూడదని అనుకుంటోంది. ఆదిత్య ధర్‌ను కనీసం 'ధురంధర్: ది రివెంజ్'లో పోస్ట్-క్రెడిట్స్‌లో మూడో పార్ట్ వస్తున్నట్టు టీజర్‌ను యాడ్ చేయమని కోరిందట.

'ధురంధర్ 3'... ఆదిత్య ధర్ ఆసక్తి చూపుతున్నారా?
జియో స్టూడియోస్ ఆసక్తి కారణంగా 'ధురంధర్ 3'ని ప్రకటించినప్పటికీ.... సినిమా షూటింగ్ వాస్తవానికి ప్రారంభమవుతుందని చెప్పలేని పరిస్థితి. ఆదిత్య ధర్ ప్రతి ప్రాజెక్ట్‌లో కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. ఆయనేం చేస్తారనేది చూడాలి.

Also ReadUstaad Bhagat Singh: 'రాజా సాబ్' చేసిన తప్పు 'ఉస్తాద్' చేయలేదు...  ప్రభాస్ సినిమాకు జరిగిన పొరపాటు పవన్ కళ్యాణ్ చేయలేదు!

'ధురంధర్‌'పై రెండున్నరేళ్ల పాటు పనిచేసిన తర్వాత... ఆ కథను వెంటనే కంటిన్యూ చేయడానికి బదులు, పూర్తిగా భిన్నమైన సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. 'ధురంధర్' విజయానికి రీజన్ ఏమిటంటే... YRF స్పై యూనివర్స్, సౌత్ ఇండియన్ యాక్షన్ సినిమాల ఫార్ములాను బ్రేక్ చేసింది. 'ధురంధర్ 3' చేసినా, చేయకపోయినా... ఆదిత్య ధర్ ఇప్పటికే జియో స్టూడియోస్ కోసం తన తదుపరి ఫీచర్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేయడానికి యాక్సెప్ట్‌ చేశారు.

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget