అన్వేషించండి

Ustaad Bhagat Singh: 'రాజా సాబ్' చేసిన తప్పు 'ఉస్తాద్' చేయలేదు

Ustaad Bhagat Singh vs Raja Saab: విడుదలకు ముందు 'ది రాజా సాబ్' టీం ఓ తప్పు చేసింది. అది 'ఉస్తాద్ భగత్ సింగ్' టీం చేయలేదు. విడుదలకు మూడు రోజుల ముందు స్మార్ట్ మూవ్ వేసింది.

సంక్రాంతి 2026కి విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమా టీం ఒక విషయంలో తప్పటడుగు వేసింది. విడుదలకు ముందు రోజు రాత్రి వరకు తెలుగు సినిమాకు కీలమైన నైజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అటువంటి తప్పు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' టీం చేయలేదు. స్మార్ట్ స్టెప్ వేసింది. ముందుగా జాగ్రత్తలు తీసుకుంది. 

టికెట్ హైక్ కోసం వెయిట్ చేయలేదు!
తెలంగాణలో విడుదలకు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్లు, అలాగే విడుదల రోజు నుంచి వారం పాటు టికెట్ రేట్ హైక్ కోసం 'ది రాజా సాబ్' టీమ్ తీవ్రంగా ట్రై చేసింది. ఆ ప్రయత్నాల్లో బుకింగ్స్ సంగతి మర్చిపోయినట్టు వ్యవహరించింది. స్టార్ హీరోల సినిమాలు అంటే మూడు నాలుగు రోజుల ముందుగా బుకింగ్స్ ఓపెన్ చేయడం కామన్. అయితే 'ది రాజా సాబ్' సినిమాకు అలా జరగలేదు. 

తెల్లవారితే సినిమా విడుదల అనగా... ముందు రోజు రాత్రి ఏడు గంటలకు జీవో వచ్చింది. అప్పటికప్పుడు ప్రెయిడ్ ప్రీమియర్లకు పర్మిషన్ రాలేదు. అప్పటి వరకు బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. దాంతో ఫస్ట్ డే ఓపెనింగ్ మీద ఎఫెక్ట్ గట్టిగా పడింది. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' టీం అటువంటి తప్పు చేయలేదు. టికెట్ రేట్ హైక్ కోసం గట్టిగా ట్రై చేయలేదు. 

Also ReadHarish Shankar: త్రివిక్రమ్‌తో పడలేదా? గొడవలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదల గురువారం అయితే సోమవారం రాత్రి బుకింగ్స్ ఓపెన్ చేసింది. అది కూడా నార్మల్ రేట్లకు. దాంతో ఫస్ట్ డే చాలా థియేటర్లలో ఆల్రెడీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఉగాది సీజన్ కనుక... టాక్ వంటి అంశాలతో సంబంధం లేకుండా మొదటి నాలుగు రోజులు థియేటర్లకు జనాలు వస్తారు. టికెట్ రేట్లు తక్కువ కాబట్టి ఫ్యామిలీలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ స్మార్ట్ స్టెప్ వేసిందని చెప్పవచ్చు.    

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

సినిమా టికెట్ రేట్స్ మీద ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఓ సినిమాకు టికెట్ రేట్ పెంచుకునే వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తే సామాన్యులకు సినిమా అందుబాటులో లేకుండా చేస్తున్నారని కొంత మంది నుంచి విమర్శలు వ్యక్తం అవుతాయి. టికెట్ రేట్ తగ్గించిన తరుణంలో క్వాలిటీ సినిమా తీయడానికి ఎక్కువ బడ్జెట్ పెట్టామని, ఆ స్థాయిలో టికెట్ రేట్లు లేవని చిత్రసీమ నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అందువల్ల, ఎప్పటికీ ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు రావడం సహజం.

Also ReadPawan Kalyan Interview: సుమ కనకాలకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget