అన్వేషించండి

Harish Shankar: త్రివిక్రమ్‌తో పడలేదా? గొడవలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి హరీష్ శంకర్ మాట్లాడారు. ఆయనతో తనకు గొడవలు ఉన్నాయని వచ్చిన పుకార్లకు క్లారిటీ ఇచ్చారు.

తెలుగు చిత్రసీమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు అత్యంత సన్నిహితులైన దర్శకులలో ఇద్దరి పేర్లు తప్పకుండా వినిపిస్తాయి. ఒకరు... మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). రెండో వ్యక్తి... హరీష్ శంకర్ (Harish Shankar). హీరోగా పవన్ ప్రయాణంలోనూ ఇద్దరూ మెమరబుల్ సినిమాలు 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'గబ్బర్ సింగ్' తీశారు. త్రివిక్రమ్‌ను పవన్ ఆప్త మిత్రుడిగా ఇండస్ట్రీ పేర్కొంటే... తనను తాను పవన్ భక్తుడిగా, వీరాభిమానిగా చెప్పుకొంటారు హరీష్. అటువంటి ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని ఓ సమయంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. 

త్రివిక్రమ్ vs హరీష్... మ్యాటరేంటి?
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆయన రీ ఎంట్రీ సమయంలో 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి సినిమాలు చేశారు. అవన్నీ రీమేకులు. అప్పటికి హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' అనౌన్స్ చేసి ఉన్నారు. హరీష్ మీద కోపం ఉంది కనుక, ఇద్దరికీ పడటం లేదు కనుక రీమేక్ సినిమాలను త్రివిక్రమ్ లైనులోకి తీసుకు వచ్చారని, హరీష్ సినిమాను డిలే చేశారని ప్రచారం జరిగింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ ప్రచారాన్ని త్రివిక్రమ్ కొట్టి పారేశారు.

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

Harish Shankar On Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో విబేధాలు అంటూ వచ్చిన వార్తలపై హరీష్ శంకర్ స్పందిస్తూ... ''అదేమీ లేదండి. సోషల్ మీడియాలో, వెబ్‌సైట్‌లో 100 వస్తాయి. అది ఇలా ఇది అలా అంటూ! ఒకవేళ ఆయనకు నాకు మధ్య విభేదాలు ఉంటే నేను త్రివిక్రమ్ గారి ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తా? నేను తీసుకు వచ్చాను గనుక మీరు ప్రశ్న అడగలరు. సంధ్య థియేటర్‌లో మొత్తం మీడియా ముందు 'గబ్బర్ సింగ్' మార్నింగ్ షో చూసి... హరీష్ బాగా రాశాడని, బాగా తీశాడని, పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూపించాలని అనుకుంటున్నారో అలా చూపించాడని చెప్పిన మాటలు నాకు ఇవాళ్టికీ గుర్తు ఉన్నాయి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అవ్వనప్పుడు ఆయన ఐదు నందులు తీసుకున్న డైలాగ్ రైటర్ ఆయన. ఆయనతో నాకు గొడవ ఏముంటుంది? నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందు ఆయన డైరెక్టర్. అంతకు ముందు రచయితగా పాపులర్. నేను ఆయన్ను అగ్రజా (అన్నయ్య) అని పిలుస్తా. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ చూసి మెసేజ్ చేశారు. మేం గంట సేపు మాట్లాడుకున్నాం'' అని చెప్పారు. 

Also ReadPawan Kalyan Interview: సుమ కనకాలకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ

త్రివిక్రమ్ అంటే తనకు గౌరవం అని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని హరీష్ శంకర్ స్పష్టం చేశారు. అన్నట్టు... హరీష్ శంకర్ దగ్గర ఇప్పుడు రెండు అడ్వాన్సులు ఉన్నాయి. ఒకటి... కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థది. రెండోది... త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న సినిమాది. అందులో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తారని తెలిసింది.

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

టాప్ హెడ్ లైన్స్

Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget