అన్వేషించండి

Pawan Kalyan: సుమ కనకాల క్వశ్చన్స్... హుషారుగా పవన్ ఆన్సర్స్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ

Ustaad Bhagat Singh: స్పాంటేనియస్‌గా సెటైర్లు వేయడంలో సుమ కనకాల స్పెషలిస్ట్. 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్‌లో ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. వాళ్ళిద్దరి సరదా సంభాషణ...

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హోస్ట్ చేయడంలో సుమ కనకాల (Suma Kanakala) రూటే సపరేట్. సెలబ్రిటీలను మాటల్లో పెట్టి అభిమానులు మెచ్చే విషయాలు రాబట్టడంలో సిద్దహస్తురాలు. స్పాంటేనియస్‌గా సెటైర్లు వేయడంలో కూడా. ఆమె సైతం షాక్ అయ్యేలా 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమాధానాలు ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ చదవండి 

సుమ: డిప్యూటీ సీఎం గారు... మీ నవ్వుని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చాం. మా కోసం మీరు ఒక్కసారి నవ్వండి!
పవన్ కళ్యాణ్ నవ్వారు. అయితే... అలా కాదని, కొద్దిసేపటి క్రితం హరీష్ శంకర్ ఏదో జోక్ వేసినప్పుడు నవ్వారని, ఆ విధంగా నవ్వమని సుమ కోరారు. పవన్ నవ్విన తర్వాత 'మీరు డిప్యూటీ సీఎం అయినా... మీ క్యూట్నెస్ ఆ స్మైల్. అది సేమ్. మారలేదు' అని సుమ చెప్పారు. 

సుమ: మీరు పుస్తకాలు చదువుతూ ఉంటారు కదా! ఇప్పుడు ఏ తరహా పుస్తకాలు చదువుతున్నారు? అసలు చదివే టైం దొరుకుతుందా?
పవన్: ఇప్పటికీ పుస్తకాలు చదువుతాను. రోజులో కనీసం రెండు గంటలు చదువుతా. నేను నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేలోపు... నిద్ర లేచిన తర్వాత 15 - 20 నిమిషాలు, ఒక 20 పేజీలు అయినా చదువుతా. ఆ తర్వాత మధ్య మధ్యలో చదువుతా. 

సుమ: అప్పట్లో మీ ఫ్యాషన్ బైక్స్ అన్నారు కదా!
(ప్రశ్న పూర్తి అవ్వకముందు పవన్ అందుకుని...) అప్పట్లో ఏంటండీ? అప్పట్లో అంటే ఎప్పుడు? 1940, 60లలో అనుకోవచ్చా! మీరు ఎలా మాట్లాడుతున్నారంటే... రాజ్ కపూర్ గారితో, కన్నాంబ గారితో సినిమాలు చేసినప్పుడు అన్నట్టు! తిప్పి కొడితే ఎంతండి? మొన్నే కదా 'ఓజీ' చేశా. నేను, ఎస్వీ రంగారావు గారు, కన్నాంబ గారు అందరూ కూర్చున్నప్పుడు కాదండీ. ఎన్టీ రామారావు గారు, నేను కలిసి అలా మాట్లాడుకున్నట్టు కాదండీ.

పవన్ కళ్యాణ్ మాటలకు సుమ అవాక్కయ్యారు. ఆ మధ్య ఇంటర్వ్యూ చేసినప్పుడు అని చెప్పబోయారు. అయితే పవన్ వరుస సెటైర్లు వెయ్యడంతో తర్వాత ప్రశ్న అడిగారు. 

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

సుమ: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్‌లో డైలాగ్ విన్నాం. 'ఇచ్చిపడేసే గోత్రం... ఇరగతీసే నక్షత్రం' అని. హరీష్ శంకర్ గారికి ఒక గోత్రం ఇవ్వాలంటే ఆయనకు ఏది సూట్ అవుతుంది?
పవన్: అతను ఇచ్చిపడేస్తాడు. హరీష్ శంకర్ (Harish Shankar)ది ఇచ్చిపడేసే గోత్రం. ఎందుకంటే... అసలు దేనికీ ఊరుకోడు. నేను ఏదైనా చెప్పినా గానీ వెంటనే దానికి కౌంటర్ ఇచ్చేసి నన్ను ఒప్పిస్తాడు. చివరకు అతను అనుకున్నదే చేస్తాడు. అతని దగ్గర ఆ స్కిల్ ఉంది. నేను డాన్స్ చేయనని మెంటల్‌గా ప్రిపేర్ అయితే... నా చేత సాంగ్ చేయించాడు. జీవితంలో నేను డాన్స్ చేయగలనా? లేదా? అని నాకే సందేహాలు ఉన్నప్పుడు నన్ను కూర్చోబెట్టి, సెట్‌లోకి లాక్కొచ్చి స్టెప్స్ చేయించాడు. నా ముందు అందరూ చూస్తుంటే... ఎలా చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. ఏదో మావాళ్ళందరూ (అభిమానులను ఉద్దేశిస్తూ...) డాన్స్ చేయకపోతే కోప్పడతారని భయంతో చేశాను.

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

సుమ: 'దేఖ్‌ లేంగే సాలా...' పాటలో పవన్ స్టెప్స్, మైఖేల్ జాక్సన్ స్టెప్స్ కంపేర్ చేస్తూ కొన్ని ఎడిట్స్ వచ్చాయి. వాటి గురించి...
పవన్: మైఖేల్ జాక్సన్ గారి గురించి చెప్పాలంటే... అసలు అలా ఎడిట్ చేయడం కూడా చాలా పాపం. ఆయనొక స్టార్, లెజెండ్. ఆయన్ను, నన్ను పెట్టి ఎడిట్ చేయడం చేశారు. మైఖేల్ జాక్సన్ అభిమానిగా చెబుతున్నా... ఆయన్ను పిచ్చిగా ఆరాధించాను. నాకు ఈ మాత్రం, కొంచెం ఒళ్ళు కదిలింది అంటే దానికి ఇన్స్పిరేషన్ మైఖేల్ జాక్సన్. ఆయన చనిపోయినప్పుడు నిజంగా నాకు కన్నీళ్లు వచ్చాయి. బాధ పడ్డాను. ఇప్పటి వరకు ఆయన గురించి చెప్పే సందర్భం రాలేదు. చెప్పడానికి అవకాశం రాలేదు. కానీ, నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి జాక్సన్. ఆయనతో అలా కంపారిజన్ చేస్తూ ఎడిట్ చేస్తుంటే కూడా నాకు నిజంగా చాలా పాపం అనిపించింది. 

సుమ: పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేయడం, శ్రీలీలా చేయకపోవడం ఈ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో జరుగుతోంది. 
పవన్: శ్రీలీల చేశారు కదా!
సుమ: ఆ పాటలో లైట్ గా కనిపించింది. జనరల్లీ ఏంటంటే శ్రీలీల నాలుగు డాన్సులు మనకు విరివిగా కనిపిస్తూ ఉంటాయి.
పవన్: అంటే... నేను హరీష్ శంకర్ కి చెప్పేశాను. ఆవిడ డాన్స్ చేస్తే నేను డాన్స్ చేయనని. ఎందుకంటే... నన్ను డామినేట్ చేస్తారు. ఆ విషయంలో నేను క్లియర్... నేనే కనిపించాలని, ఇంకెవరు కనిపించకూడదని చాలా ఆంక్షలు పెట్టి ఆ పాట చేశాను (సరదాగా చెప్పారు).

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

టాప్ హెడ్ లైన్స్

NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget