Ameer Rinku Singh Trending | IPL 2025 లోనూ తన పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ | ABP Desam
రింకూ సింగ్ 2023లో తన అత్యద్భుతమైన ఫినిషింగ్ ఫైర్ వర్క్స్ తో ఐపీఎల్ లో దుమ్ము రేపిన ఆటగాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్నా తనకు ఎప్పుడూ రాని ఫేమ్ 2023లో వచ్చింది. దానికి రీజన్ రింకూ సింగ్ అనుభవించి వచ్చిన పేదరికం లో నుంచి పుట్టిన మంట అంటారు. అవును రింకూ సింగ్ తండ్రి గ్యాస్ సిలిండర్ సప్లయర్. రింకూ సింగ్ కూడా ఇళ్లకు సిలిండర్స్ వేసేవాడు. యూపీలోని అలీఘర్ ఓ ఇనిస్టిట్యూట్ వాటర్ కేన్స్ వేసుకుంటూ అక్కడి కుర్రాళ్లతో క్రికెట్ ఆడేవాడు రింకూ. అలా ఐపీఎల్ వరకూ తన టాలెంట్ పాకి 2023లో ప్రూవ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే రింకూ కు పేరు వచ్చిందో...తనకు డబ్బు రావటం మొదలైంది. 2023లో 4 హాఫ్ సెంచరీలతో 474 పరుగులు చేసిన రింకూ సింగ్ ను కోల్ కతా బాగా ఎంకరేంజ్ చేసింది. కానీ 2024లో 15 మ్యాచ్ లు ఆడి కేవలం 168 పరుగులే చేశాడు రింకూ సింగ్. ఆ ఏడాది కేకేఆర్ ఛాంపియన్ గా నిలవటంతో తనపై నమ్మక ముంచి ఈ ఏడాది ఏకంగా 13 కోట్లు పెట్టి కొనుక్కుంది కేకేఆర్. కానీ రింకూ నుంచి ఆ డబ్బుకు తగిన ప్రదర్శన అస్సలు రావటం లేదు. ఈ సీజన్ లో మూడు మ్యాచులు ఆడిన రింకూ 29 పరుగులు చేశాడు. గత పది మ్యాచుల్లో రింకూ సింగ్ కి ఒక్క హాఫ్ సెంచరీ కాదు కదా కనీసం 20 పరుగుల దాటించిన మ్యాచ్ కూడా లేదు. అంత ఘోరంగా ఆడుతున్నా తన టాలెంట్ పై నమ్మకంతో కేకేఆర్ అవకాశాలు ఇస్తూనే వస్తోంది. అయితే రింకూ ఆ అవకాశాలను వృథా చేసుకుంటున్నాడని బాధపడుతున్న ఫ్యాన్స్ ఇదే రింకూ పేదవాడిగా ఉన్నప్పుడు ఆకలి మంటలతో ఆడేవాడని ఆ కసి తన బ్యాటింగ్ లో కనిపించేదని పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు రింకూ అమీర్ అయిపోయాడు దీనికి రీజన్ తనకు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అయిన ప్రియా సరోజ్ పెళ్లి నిశ్చయమైంది. యూపీలో అత్యంత ధనవంతులైన తుఫానీ సరోజ్ కుమార్తె ప్రియా సరోజ్. ఇటీవలే 25ఏళ్లకే పార్లమెంటుకు ఎన్నికై ప్రస్తుతం దేశంలో చిన్న వయస్సు ఎంపీగా ఉన్నారు ప్రియా సరోజ్. సో అలాంటి ధనవంతులతో సంబంధం కలపుకున్నాక రింకూ రెండేళ్ల నుంచి ఆ సిరిలో బతుకున్నాడని తనకు ఇప్పుడు క్రికెట్ అంత అవసరం లేదు కాబట్టి ఆకలి విలువ తెలియట్లేదని దుమ్మెత్తి పోస్తున్నారు ఫ్యాన్స్. నిజంగా రింకూ కు ఫాంకు అతని పర్సనల్ లైఫ్ కి లింక్ ఉన్నా లేకపోయినా రింకూ ఇలానే ఆడితే ఎంత కేకేఆర్ అయినా టీమ్ నుంచి తప్పించటం ఖాయంగా కనపడుతోంది.





















