అన్వేషించండి

Renu Desai Video: హెచ్‌సీయూ భూ వివాదంపై రేణు దేశాయ్ సంచలన పోస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిక్వెస్ట్

Telangana CM Revanth Reddy | 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తోంది.

400 acre Lands Auction |హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆ 400 ఎకరాలు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూమి అని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. అటవీ భూమిని నాశనం చేసి, వన్య మృగాలకు ఆవాసం లేకుండా చేస్తారా అని ప్రజా సంఘాలు, జంతు ప్రేమికులు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హెచ్‌సీయూతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సైతం ఈ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా సెలబ్రిటీలు గళం విప్పుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటి, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తెలంగాణ ప్రభుత్వానికి ఓ రిక్వెస్ట్ చేశారు.

నాకు 44 ఏళ్లు.. ఇంకా ఏమీ ఆశించడం లేదు..

400 ఎకరాల భూమి ఎంతో ఆక్సిజన్ ఇస్తోందని, ఆ అటవీ భూములను అలాగే వదిలేయాలని రేణు దేశాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. వీలైతే సీఎం రేవంత్ రెడ్డి ఆ భూములు కాకుండా వేరే చోట డెవలప్ మెంట్ చేయాలని కోరారు. ఓ తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన పిల్లలకు ఆక్సిజన్, ప్రకృతి వనరులు కావాలి. మనం కొన్నేళ్లలో ఎలాగూ చచ్చిపోతాం. కానీ భవిష్యత్ తరాలకు ఇలాంటి ప్రకృతిని దూరం చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డికి రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు. నాకంటే మీకు ఎక్కువ తెలుసు, ఎంతో అనుభం ఉంది. మరోసారి ఈ భూముల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరుతూ ఓ వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.  ఇప్పుడు నాకు 44 ఏళ్లు ఇంకా ఏమీ ఆశించడం లేదు, తల్లిగా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, ఆక్సిజన్, నీళ్లు ఉండాలని కోరుకుంటున్నానని వీడియోలో తెలిపారు. కొందరు స్నేహితులు ఈ అంశంపై వీడియో చేయవద్దని చెబుతున్నా, ఓ తల్లిగా వీడియో చేయాల్సి వచ్చిందన్నారు రేణు దేశాయ్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

 

రేణు దేశాయ్ వీడియో పోస్టులో ఏముందంటే..
నమస్కారం, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది ప్రజల నుంచి హృదయపూర్వక రిక్వెస్ట్. హెచ్‌సీయూ భూముల వివాదం గురించి తెలిసింది. ఓ తల్లిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఎలాగూ 44 ఏళ్లు. త్వరలోనే నేను పోతానని తెలుసు. కానీ మన పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలి. వాళ్లకు విద్య, నీళ్లు, ఆక్సిజన్ కావాలి. అభివృద్ధి కావాలి. ఐటీ పార్కులు, ఎత్తైన భవనాలు మనకు అవసరమే. కానీ ఈ 400 ఎకరాల భూమిని మాత్రం వదిలేయండి. ఎన్నో వృధాగా ఉన్న భూములు మనకు ఉన్నాయి.

మీరు మనసు పెడితే ఆ భూములు కాకుండా, వేరే చోట అభివృద్ధి చేయండి. ఈ వయసులో నేను ఏమీ ఆశించడం లేదు. మీ ముందు నేను ఎంతో కాదు. ఒక్కసారి ఈ విషయంపై ఆలోచించండి. ఎకో సిస్టమ్ ను కాపాడండి. ఆక్సిజన్, చెట్లు, పర్యావరణం కావాలి. మీరు దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని ఓ తల్లిగా హృదయపూర్వకంగా రిక్వె్స్ట్ చేస్తున్నారు. మంత్రులు, అధికారులు, ప్రభుత్వం మరోసారి ఆలోచించి ఆ భూమిని మాత్రం వదిలేసి.. మరోచోట అభివృద్ధికి ఆస్కారం ఉంటుందేమో చూడాలని ఓ తల్లిగా కోరుతున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget