అన్వేషించండి

BRS Supreme Court: ఇంకా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండానే సుప్రీంకోర్టులో పిటిషన్ - బీఆర్ఎస్ వ్యూహం ఇదే !

Supreme Court: సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ ను ఆదేశించలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయినా బీఆర్ఎస్ సుప్రీంకర్టులో పోరాటం ఎందుకు చేస్తోంది ?

Can the Supreme Court order the Speaker to disqualify the MLAs :  ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం  ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన పార్టీకి రాజీనామా చేసినా  ఇతర పార్టీ సభ్యత‌్వం తీసుకున్నా  అనర్హులవుతారు.  ఈ  చట్టం ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు అనర్హతా వేటుకు గురయ్యే అర్హత సాధించినట్లే. కానీ అదే చట్టంలో అనర్హతా వేటు ఎవరు వేయాలో నిర్దేశించారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. మరో విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎవరైనా ఎమ్మెల్యేపై కోర్టులు అనర్హతా వేటు వేసిన తీర్పులు ఉన్నాయి కానీ ఇలా పార్టీ ఫిరాయింపుల కింద అనర్హతా వేటు వేసిన తీర్పులు గతంలో లేవు. అదే సమయంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టులు కూడా ఆదేశించలేవు. సభా వ్యవహారాల్లో స్పీకర్ ను ఆదేశించే అధికారం కోర్టులకు లేదని నిపుణులు చెబుతున్నారు. 

ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని రెండు పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ 
 
భారత రాష్ట్ర సమితి తరపున గెలిచి  కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి పై వేటు వేయించేదాకా పోరాటం చేయాలని  బీఆర్ఎస్ డిసైడ్ అయింది. అందుకే అన్ని రకాలుగా బీఆర్ఎస్ లీగల్ టీంతో కసరత్తులు చేయించి తాజాగా సుప్రీంకోర్టులో తమ వాదనను బలపరిచేలా రెండు పిటిషన్లు వేయించారు. 10 మంది ఎమ్మెల్యేల‌పై ఫిర్యాదు చేసిన 9 నెల‌లు అవుతున్నా.. స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోలేద‌ని బీఆర్ఎస్  పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెల‌లైనా ఇప్ప‌టికీ స్పీక‌ర్ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌లేద‌ని కోర్టుకు బీఆర్ఎస్ తెలిపింది. క‌నీసం నోటీసు కూడా ఇవ్వ‌లేద‌ని పిటిష‌న్‌లో బీఆర్ఎస్ పేర్కొంది. గ‌తంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అమ‌లు చేయాల‌ని కోర్టును బీఆర్ఎస్ కోరింది. పార్టీల ఫిర్యాదుల‌పై స్పీక‌ర్ మూడు నెల‌ల్లో నిర్ణ‌యం చెప్పాల‌ని కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు వ‌చ్చింద‌ని  .. ఆ తీర్పునకు అనుగుణంగా స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోవట్లేద‌ని బీఆర్ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లో స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునేలా ఆదేశాలివ్వాల‌ని బీఆర్ఎస్ కోరుతోంది. 

తెలంగాణ హైకోర్టులో అనుకూలంగా రాని తీర్పు 

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్‌కు అనుకూల నిర్ణయం రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సింగిల్ బెంచ్ ధర్మాసనం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కానీ డివిజన్ బెంచ్ మాత్రం స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవాలని కాలపరిమితి లేదని తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది.  ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హతా వేటు వేయిస్తామని కేటీఆర్ అదే పనిగా చెబుతున్నారు.  తొందరలోనే పది నియోజకవర్గాల్లోను ఉపఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ బాగా నమ్మకంతో చెప్పారు.  

అన్ని రాష్ట్రాల్లోనూ ఫిరాయింపులు

తెలంగాణలో మాత్రమే కాదు ఏపీ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా పెద్దఎత్తున ఫిరాయింపులు జరిగాయి. అయితే ఎవరి మీదా అనర్హత వేటుపడింది లేదు.  ఫిరాయింపులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై తొందరగా నిర్ణయం తీసుకోమని స్పీకర్, ఛైర్మన్లకు కోర్టులు సూచనలు ఇస్తాయి కానీ.. ఫలానా చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన సందర్భం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారు కానీ టైమ్ ఫ్రేమ్ లేకుండా స్పీకర్‌దే నిర్ణయమని చెప్పడం ద్వారా.. మొత్తం చట్టం ఉద్దేశం నిర్వీర్యమైపోయింది. ఆ కారణంగానే గతంలో బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వంతు.

ఈ అంశంపై బీఆర్ఎస్‌కూ స్పష్టత ఉందని .. ఇంకా పార్టీలుమారే ఎమ్మెల్యేలు ఉంటే వారిని ఆపడానికి ఈ ప్రయత్నమని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget