Basara IIIT Student Suicide: పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీసిన విద్యార్థిని తల్లి, ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోలీస్ సంఘాలు
Girl Student suicide at Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు దారితీసింది. తాము రాకుండా ఇక్కడికి ఎందుకు తెచ్చారంటూ ఎస్సై కాలర్ పట్టుకుని మృతురాలి తల్లి నిలదీశారు.
![Basara IIIT Student Suicide: పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీసిన విద్యార్థిని తల్లి, ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోలీస్ సంఘాలు RGUKT woman caught shirt of Police after Girl Student suicide at Basara IIIT Basara IIIT Student Suicide: పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీసిన విద్యార్థిని తల్లి, ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోలీస్ సంఘాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/12/c63a9d69d0b32f1aabc6c10bf037ab5b1731413552211233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Basara IIIT Student Death News | నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ మృతిపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తాము రాకముందే మృతదేహాన్ని హాస్పిటల్ మార్చురీకి ఎందుకు తీసుకొచ్చారని పోలీస్ గల్లా పట్టుకొని స్వాతి ప్రియ తల్లి నిలదీశారు. తమ కూతురు ర్యాగింగ్ కు బలైందంటూ గుండెలవిసేలా ఏడ్చారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని.. దానికి పోలీసులు సహకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోలీస్ సంఘాలు
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఉదయం సమాచారం వచ్చింది. బాసర ఎస్ఐ గణేష్ హుటా హుటిన బాసర పిహెచ్ లో ఉన్న విద్యార్థినిని యూనివర్సిటీ అధికారుల అభ్యర్థనల మేరకు బైంసా హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. అప్పటికే విద్యార్ధిని చనిపోయిందని వైద్యులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ అమ్మాయి 6 పేజీల సూసైడ్ నోట్ రాసింది. ఆ లేఖ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రచారం అయింది. ఆ అమ్మాయి అన్ని వివరంగా రాసింది. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆమె ఆత్మ హత్యకు కారణాలు పోస్టుమార్టం చేయించడానికి భైంసా హాస్పిటల్ దగ్గర విధి నిర్వహణలో, యూనిఫాంలో ఉన్న ఎస్సైని ఆమె తల్లీ నా కూతుర్ని నువ్వే చంపేసావ్ అంటూ గల్లా పట్టుకొని లాగుతూ కొట్టడం న్యాయమా? అని పోలీస్ అధికారుల సంఘం ప్రశ్నించింది. బిడ్డను పోగొట్టుకున్న కడుపు కోత అర్థం చేసుకోగలం కానీ అంకిత భావంతో పనిచేసే పోలీసుల మీద దాడి చేయడం మంచిది కాదని తీవ్రంగ ఖండించారు.
Also Read: Janwada Farm House Case: జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ
ఆత్మహత్యకు ఎస్సై కి సంబంధము ఏమిటి? మాకు కూడా కుటుంబాలు ఉంటాయి. పోలీస్ ఆధికారుల మీద డౌర్జన్యం చేసి మా మానసిక స్థైర్థ్యం దెబ్బ తీయవద్దు. విధి నిర్వహణలో జోక్యం చేసుకోవడం తప్పనీ.. ఇట్టి విషయాన్నీ పోలీస్ సంక్షేమ సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో బాసర ఎస్సై గోదావరిలో ఆత్మహత్యకు పాల్పడిన ఎంతో మంది ప్రాణాలు కాపాడి ఎంతో మంది మన్ననలు పొందారు. ఈ సంఘటనలో కూడా ఆయన విధులు నిర్వర్తించారు. ప్రజలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందించే పోలీసులపై చేయి చేసుకొనే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు రక్షణగా ఉంటూ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. నిన్న భైంసా హాస్పిటల్ లో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని గళ్ళ పట్టి కొట్టటంతో అందరూ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. మా పోలీస్ కుటుంబ సభ్యులు ( భార్యలు, పిల్లలు మరియు తల్లి తండ్రులు) తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఆ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని అలా అవమానించటం సబబు కాదు. అందుకని మృతురాలి తల్లి అయిన పూరి ఉజ్వల w / o పూరి రవీందర్, నివాసం ఆర్మూర్ మీద చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా పోలీసు అసోషియేషన్ అధ్యక్షులు పోలీసు అధికారులు, సిబ్బంది తరుపున కోరారు.
తెలంగాణ పోలీసు అంటే దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, నిర్మల్ పోలీస్ మీ పోలీస్ తో ప్రజల ఆధారాభిమానులు పొందుతుంటే... ఇలా ఎస్ఐ మీద దాడి చేసి దుర్భాషలాడటం అస్సలు మంచిది కాదని... దీని మీద చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)