మినీ మేడారం జాతర తేదీలు ఫిక్స్, 4 రోజులపాటు వేడుకలు

గిరిజన కుంభమేళా, దక్షిణాది కుంభమేళాకు పిలుచుకునే సంబురం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర తేదీలను ఆదివాసీ గిరిజన పూజారులు శనివారం నాడు ప్రకటించారు.

12 ఫిబ్రవరి 2025 నుండి 4 రోజుల పాటు మినీ మేడారం జరగనుంది. ఫిబ్రవరి 15 వరకు జాతరను జరపడానికి పూజారులు నిర్ణయించారు

సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారులు మేడారంలో సమావేశమై మిని మేడారం జాతర తేదీలను ప్రకటించారు

మినీ మేడారం జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెలించుకోవాలని కోరారు.

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం వద్ద గిరిజన మినీ మేడారం జాతర ప్రారంభమవుతుంది.

ప్రజలను పీడించిన పాలకులపై తల్లి సమ్మక్క, కుమార్తె సారలమ్మల పోరాటాన్ని మేడారం జాతర గుర్తు చేస్తుంది.