మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి
మహబూబాబాద్ జిల్లాలో గ్రానైట్ బండరాయి పడి నలుగురు కూలీలు మృతి చెందారు.
లారీలో తరలిస్తున్న గ్రానైడ్ రాయి ఆటోపై పడి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది
కురవి మండలంలోని అయ్యగారి పల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మృతులు చిన్న గూడూరు మండలంలోని జయ్యారం వాసులుగా గుర్తించారు.
కూలి పనుల కోసం వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
క్రేన్ సహాయంతో బండరాళ్లను తొలగించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు
గాయపడ్డ నలుగురికి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.