తెలంగాణ గోవాగా పిలిచే లక్నవరం అందాలు చూశారా

గోవా, సిమ్లా, ఊటీ అనే ఏవేవో ప్లాన్ చేస్తుంటారు. కానీ ముందు తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటక స్థలాలు చూసేద్దామా

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం లేక్ చూడాలి. ప్రకృతి అందాల నడుమ చూడముచ్చటగా ఉంటుంది.

చుట్టూ దట్టమైన అడవి, పచ్చటి కొండల మధ్యలో పెద్ద జలాశయంలా లక్నవరం చెరువు కనిపిస్తుంది. చిన్న తరహా ఐలాండ్ ఫీలింగ్ వస్తుంది

లక్నవరం చెరువు వద్ద వాటర్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్, అద్భుతమైన సౌకర్యాలతో మంచి భోజన వసతి ఉండే రీసార్ట్ సైతం ఏర్పాటు చేశారు

హైదరాబాద్ నుంచి దాదాపు 150 కిలో మీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 75 కి.మీ దూరంలో లక్నవరం చెరువు ఉంది.

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లీజు పద్దతిలో రిసార్టును డెవలప్ చేసింది ఫ్రీకౌట్స్ సంస్థ. దానికి ది కోవ్ పేరు పెట్టింది

లక్నవరం చెరువు వద్ద బోటు షికారు పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తోంది. అక్కడి రీసార్ట్ లో జిప్ లైన్ లాంటి అడ్వంచర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ ను ఆస్వాదించవచ్చు.

వీకెండ్ రోజు వెళితే లక్నవరం చెరువుతో పాటు 30 కి.మీ దూరంలో ఉండే రామప్ప ఆలయాన్ని సైతం పర్యాటకులు దర్శించుకునే వీలుంటుంది