Mini Medaram Jatara: మినీ మేడారం జాతరలో వనదేవతలకు పూజలు మాత్రమే, గద్దెల పైకి రాని సమ్మక్క, సారలమ్మ
Medaram Jatara: మినీ మేడారం జాతర జాతర ప్రారంభమైంది. వనదేవతలకు పూజలు మాత్రమే చేస్తారు కానీ.. మినీ జాతరలో గద్దెల పైకి రాని సమ్మక్క, సారలమ్మలను తీసుకరారు.

Mini Medaram Jatara: వరంగల్: మేడారం సమ్మక్క సారలమ్మలంటే కోట్లాదిమంది భక్తులకు ఎంతో నమ్మకం. బుధవారం ఉదయం మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు మినీ మేడారం జాతర కొనసాగనుంది. గిరిజన పూజారులు ఆదివాసీ గిరిజన ఆచారం సంప్రదాయాల పద్ధతిలో వనదేవతలకు పూజలు నిర్వహిస్తారు. ఉదయం పూజారులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో జాతర ప్రారంభమైంది. జాతరకు భక్తులు పోటెత్తనున్నారు. జాతరకు తరలివచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఆర్టీసి 400 ట్రిప్పులను నడుపుతుంది.
వనంలో వనదేవతలు
ములుగు జిల్లా అభయారణ్యంలో కొలువైన వందేవతల మహజాతర ప్రతి రెండు సంవత్సరాల కోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుండి నాలుగు రోజుల పాటు నిర్వహించడం ఆదివాసీ గిరిజనుల ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రతి ఏటా ఆదివాసీ గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో మహజాతర నిర్వహించిన వచ్చే ఏడాదిని మేడారం మినీ జాతరగా నిర్వహిస్తున్నారు ఆదివాసీ గిరిజన పూజారులు. వందేవతలపై భక్తులకు అపారమైన నమ్మకం ఉండడంతో మినీ మేడారం జాతరకు సైతం భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది మినీ మేడారం నేటి నుండి 15 తేదీ వరకు జాతర జరగనుంది. ఈ జాతరలో మహాజాతర సమయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇప్పుడు ఇదే పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు.
వారం రోజుల ముందు నుండే పూజలు..
మినీ జాతరకు సరిగ్గా వారం రోజుల ముందు మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయంలో, కొండాయి గ్రామంలో గోవిందరాజులకు, పూనుగొండ్ల లో పగిడిద్ద రాజు ఆలయంలో ఆదివాసీ గిరిజనులు పూజలు చేస్తారు. అదే విధంగా లాస్ట్ బుధవారం రోజు ఆయా ఆయా ఆలయాల్లో పూజారులు గుడిమెలిగె పండుగను నిర్వహించారు. ములుగు గట్టమ్మ వద్ద నాయకపోడు పూజారులు ఎదురుపిల్ల వేడుక నిర్వహించారు. అదే
సమయంలో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు అంకురార్పణ చేశారు.
పూజలు మాత్రమే... వనదేవతలు గద్దెలపైకిరారు..
మినీ మేడారం జాతరలో ఆదివాసీ గిరిజన పూజారులు వనదేవతలకు పూజలు మాత్రమే నిర్వహిస్తారు. మహతర సమయంలో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు ను గద్దెల పైకి తీసుకువైవచ్చి ప్రతిష్టిస్తారు. అయితే మినీ మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు పూజారులు ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు.
భక్తుల మొక్కులు.
భక్తులు వదేవతలకు బంగారం (బెల్లం), పసుపు, కుంకుమతో చిరా చార సమర్పించుకుంటారు. ఎదురుకొళ్లు, మేకలను కూడా వందేవతలకు బలివ్వడం భక్తుల నమ్మకం.
పోటెత్తిన భక్తులు
మినీ మేడారం జాతరకు 15 లక్షల నుండి 20 లక్షల వరకు భక్తులు తరలితనుండడంతో ములుగు జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

