అన్వేషించండి
Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, వెంట కుమారుడు అకీరా నందన్ Photos చూశారా
Akira Nandan With Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన ప్రారంభించారు. ఆయన వెంట కుమారుడు అకీరా నందన్ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, వెంట కుమారుడు అకీరా నందన్ Photos చూశారా
1/7

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దక్షిణాది ఆధ్యాత్మిక యాత్ర బుధవారం ఉదయం ప్రారంభించారు. ఇదివరకే ఈ విషయాన్ని ప్రకటించారు.
2/7

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి బుధవారం ఉదయం చేరుకున్నారు.
3/7

కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
4/7

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సనాతన ధర్మం, హిందుత్వంపై ఫోకస్ చేసి రాజకీయాలు చేస్తున్నారు. తమిళ డిప్యూటీ సీఎం స్టాలిన్ తో సనాతన పోరు మొదలైంది.
5/7

దక్షిణాది ఆలయాల ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన పవన్ కళ్యాణ్ వెంట ఆయన తనయుడు అకీరా నందన్ ఉన్నాడు. దాంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
6/7

రాజకీయాలకు పిల్లల్ని దూరంగా ఉంచాలని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్.. సనాతన పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు ఎలాగూ ఉన్నాయి. దీనికి తోడు ఆలయాల సందర్శనలో తన వెంట అకీరాను తీసుకెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది.
7/7

గతంలో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ తాజాగా కేరళ, తమిళనాడు ఆలయాల పర్యటనకు కుమారుడు అకీరా నందన్ ను వెంట తీసుకెళ్లారు.
Published at : 12 Feb 2025 11:42 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రికెట్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion