అన్వేషించండి

Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం

గ్రామసభల ఆమోదంతోనే పనులు చేపట్టాలని, 42 అంశాలతో త్వరలో అవేర్ యాప్ విడుదల చేయాలని రియల్ టైమ్ గవర్నెన్సుపై సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను మరింత మెరుగ్గా అందించాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేంద్రంలో పలు అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూ, ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని, నరేగా (NREGA) పనులకూ ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు.

జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి..

మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థంగా వివిధ అంశాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవడంతో పాటు సామర్థ్యాలను పెంచుకోవాలని పేర్కొన్నారు. సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్‌ ద్వారానే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించడం ద్వారానే దీనిని సాధించవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, పౌరసేవలకు సంబంధించి ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం కీలకమైన అంశంగా పరిగణించాలన్నారు. దీనికి సంబంధించి 175 నియోజకవర్గాల్లోనూ కెపాసిటీ బిల్డింగ్ (సామర్థ్య పెంపు) కూడా జరగాలని అన్నారు. ప్రజల్లో సానుకూలత పెరిగేలా సూక్ష్మ స్థాయి వరకు విశ్లేషణ జరగాలని సూచించారు.

ఇటీవల రాష్ట్రంలో మొక్కజొన్న, కాటన్ (పత్తి), అరటి పంటల్లోని సమస్యను పరిష్కరించి రైతులకు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ శాఖలు ఆర్థిక, ఆర్థికేతర అంశాలను ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని, తద్వారా ప్రజల్లో సానుకూల ధోరణి పెరిగేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలన్నారు. నిరంతరం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పౌర సేవల్ని అందించటంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

టెక్నాలజీ, పర్యవేక్షణ చర్యలు
త్వరలో ప్రజలకు అందుబాటులోకి 'అవేర్ యాప్' తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం ఈ యాప్‌ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలూ డేటా లేక్‌కు అనుసంధానం కావాలని సూచించారు.  రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీని పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలోని తాగు నీరు, పరిశుభ్రత తదితర అంశాలపై పర్యవేక్షణ జరగాలని సూచించారు. దీనిపై ఓ యాప్‌ను రూపొందించి రోజువారీగా తనిఖీ చేస్తున్నామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.

దేవాలయాలు, పర్యావరణం
తిరుమలలో టీటీడీ భక్తులకు అందించే సేవలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ లాంటి అంశాలను అధ్యయనం చేసి ఇతర దేవాలయాల్లో అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. కాలుష్య నియంత్రణ మండలితో కలిసి ఎయిర్ క్వాలిటీ సెన్సార్లను ఏర్పాటు చేసి ఆ వివరాలను కూడా ప్రజలకు అందించాలన్నారు. సుపరిపాలనా అంశాలపై డిసెంబరులో ఎమ్మెల్యేలు, ఎంపీలతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
Advertisement

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Youtuber Anvesh:పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
I Bomma: ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్! ఆధారాలుంటే చూపించండని పోలీసులకే షాకిచ్చిన రవి!
ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్! ఆధారాలుంటే చూపించండని పోలీసులకే షాకిచ్చిన రవి!
Embed widget