Vijay Deverakonda: 'కింగ్డమ్'పై నేషనల్ క్రష్ స్పెషల్ పోస్ట్... రష్మికకు దేవరకొండ పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా?
Vijay Devarakonda and Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. మరి రౌడీ హీరో రష్మికకు పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా ?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త మూవీ 'కింగ్‌డమ్' నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాగా, రష్మిక మందన్న ఈ టీజర్ పై స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ రష్మికను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలిసిపోయింది.
రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ ముద్దు పేరు
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం వర్కింగ్ టైటిల్ 'వీడి 12'. ఈ మూవీ టైటిల్ తో పాటు టీజర్ ను ఫిబ్రవరి 12న ఆవిష్కరించారు మేకర్స్. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కు 'కింగ్‌డమ్' అనే పేరు పెట్టినట్టు ఈ టీజర్ ద్వారా వెల్లడించారు. ఇక టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, రష్మిక మందన్న కూడా తన 'చావా' ప్రమోషన్లను పక్కన పెట్టి, 'కింగ్‌డమ్'పై రియాక్ట్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంది.
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రష్మిక "ఈ మనిషి ఎప్పుడూ మెంటల్ గా వస్తాడు... విజయ్ దేవరకొండ చాలా గర్వంగా ఉంటాడు" అంటూ రష్మిక మందన్న చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆమెను క్యూట్ గా ముద్దు పేరు పెట్టి పిలవడం హైలెట్ గా నిలిచింది. రష్మిక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కి స్పందిస్తూ ఆమెను 'రుషి' అని పిలిచాడు దేవరకొండ. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ రష్మికను స్పెషల్ గా 'రుషి' అని పిలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు 'కింగ్‌డమ్' టీజర్ రిలీజైన గంటల వ్యవధిలో భారీ సంఖ్యలో వ్యూస్ రాబట్టింది.
'కింగ్డమ్' టీజర్ ఎలా ఉందంటే?
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న 'కింగ్‌డమ్' మూవీ టీజర్ పవర్ ఫుల్ గా ఉంది. ఇందులో జనాలను రక్షించాలని నిశ్చయించుకున్న రక్షకుడిగా విజయ్ దేవరకొండ కనిపించారు. టీజర్ లోనే 2025 మే 30న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక టీజర్ లో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీ తెలుగు వెర్షన్ టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. అలాగే తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ ఈ 'కింగ్డమ్' మూవీ టీజర్ కు వాయిస్ ఓవర్ అందించారు. యుద్ధంతో కూడిన నేపథ్యంతో 'కింగ్డమ్' మూవీ సాగుతుందని టీజర్ ద్వారా వెల్లడించారు. ఇక ఇందులో విజయ్ దేవరకొండ ఇంటెన్స్ లుక్ లో బజ్ కట్, ఫుల్ గడ్డంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా కనిపించాడు. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ టీజర్ లో మాత్రం దీని గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు మేకర్స్.
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?





















