Ram Charan - Allu Arjun: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?
Ram Charan Unfollows Allu Arjun: మెగా కజిన్స్ రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య ఏం జరుగుతుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో బన్నీని చెర్రీ అండ్ ఫాలో చేయడమే అందుకు కారణం.

Ram Charan Latest News: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... ఇద్దరూ కజిన్స్! వరుసకు బావ, బావమరిది అవుతారు. వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం కంటే ఎక్కువ స్నేహం ఉండేది. అయితే... ఇప్పుడు ఈ మెగా కజిన్స్ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు అన్ ఫాలో అవుతున్నారు? అనేది అటు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఇటు సామాన్య ప్రేక్షకులలోనూ హాట్ టాపిక్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్!
సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారు. కొన్ని రోజుల క్రితం వరకు ఆయన ఫాలో అయ్యారు. ఏమైందో ఏమో... తాజాగా అన్ ఫాలో చేశారు. ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
బన్నీని అన్ ఫాలో చేసిన రెండో మెగా హీరో రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ కంటే ముందు మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ సైతం అన్ ఫాలో చేశారు. ఏపీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో సాయి దుర్గ తేజ్ ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ఎన్నికల సమయం నుంచి కొణిదెల - అల్లు కుటుంబాల మధ్య అంతగా సత్సంబంధాలు లేవని, పరిస్థితులు ఉప్పు - నిప్పు అన్నట్లు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు ఆఫ్ ద రికార్డు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ పుకార్లకు తోడు 'తండేల్' వేడుకలో 'గేమ్ చేంజర్' డిజాస్టర్ అని, 'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్ బస్టర్ అని అర్థం వచ్చేలా అల్లు అరవింద్ మాట్లాడడంతో మెగా అభిమానులు తీవ్రంగా హార్ట్ కావడం తెలిసిన విషయాలే.
తనకు ఉన్న ఏకైక మేనల్లుడు రామ్ చరణ్ అని, తనకు కొడుకుతో సమానమని ఆ వివాదానికి అల్లు అరవింద్ పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో 'చిరుత' యావరేజ్ అని చేసిన వ్యాఖ్యలపై మాట్లాడడానికి నిరాకరించారు. కట్ చేస్తే ఇప్పుడు మేనమామ అల్లు అరవింద్ కొడుకు బన్నీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అన్ ఫాలో చేశారు రామ్ చరణ్.
రామ్ చరణ్ అన్ ఫాలో చేసినా... ఉపాసన మాత్రం!
బన్నీని రామ్ చరణ్ అండ్ ఫాలో చేసిన సరే... అతని భార్య ఉపాసన మాత్రం ఫాలో అవుతోంది. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులతో పాటు బన్నీ ప్రైవేట్ అకౌంట్‌ను సైతం ఉపాసన ఫాలో అవుతుంది. అలాగే, అల్లు శిరీష్ అకౌంట్‌ను కూడా. బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ శిరీష్ అకౌంట్‌ను ఫాలో అవుతుండడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ మాత్రం తన సతీమణి స్నేహారెడ్డిని ఒక్కరినే ఫాలో అవుతున్నారు.
Also Read: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

