Actress: మహేష్, చరణ్, ఎన్టీఆర్, బన్నీతో నటించిన అందాల బొమ్మ, పాన్ ఇండియా హీరోయిన్ తల్లి ఫోటో ఇది... ఎవరో గుర్తు పట్టగలరా?
Actress : ఫోటోలో కన్పిస్తున్న బుట్టబొమ్మ ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తల్లి. అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి నటించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే ?

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న నటి తల్లి. హీరోయిన్లను మించిన అందంతో చూడడానికి ముచ్చటగా ఉన్న ఆమె కూతురు టాలీవుడ్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని ముద్ర కూడా వేయించుకుంది ఆ హీరోయిన్. కానీ ఆ తర్వాత మాత్రం 'నీ కాళ్ళను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్ళు' అనిపించేలా చేసింది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరు? అన్న విషయం అర్థం అయ్యి ఉంటుంది. ఆమె మరెవరో కాదు పూజ హెగ్డే.
లతా హెగ్డే ఏం చేస్తారో తెలుసా ?
ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పూజ హెగ్డే తల్లి. అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా ఆవిడ చూడచక్కగా ఉంటారు. అందంలో ఇప్పటికీ కూతురుతో పోటీ పడుతూనే, ఎప్పుడూ చలాకీగా కనిపిస్తారావిడ. నిజానికి పూజా హెగ్డే తల్లి లతా హెగ్డే పెద్దగా బయట కనిపించరు. కానీ ఇప్పటిదాకా ఆమె గురించి అందిన సమాచారాన్ని బట్టి చూస్తే ఆమె పూజా హెగ్డేకి పూర్తిగా సపోర్ట్ చేయడమే కాదు, ఎప్పుడూ సరదాగా ఉంటారని అర్థమవుతుంది. పూజా హెగ్డే పుట్టింది, పెరిగింది మొత్తం ముంబైలోనే.
పూజా హెగ్డే తండ్రి పేరు మంజునాథ్, తల్లి పేరు లతా హెగ్డే. వీరిద్దరూ కర్ణాటకకు చెందిన మంగళూరు వాస్తవ్యులు. ఇక బుట్ట బొమ్మకు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. ఆయన పేరు రిషబ్ శెట్టి, డాక్టర్. పూజా హెగ్డే తండ్రి మంజునాథ్ ఓ క్రిమినల్ లాయర్, అయినప్పటికీ అడ్వర్టైజ్మెంట్ రంగంలో కూడా పని చేసేవారట. ఆమె తల్లి లత ఎంబీఏ వరకు చదువుకున్నారు. ఇక లత 2022లో లా పుస్తకాలు చేత పట్టి, వార్తల్లో నిలిచారు. కూతురు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు సంబంధించిన ఈవెంట్లలో ఎక్కువగా కనిపించరు లతా హెగ్డే. ఒకటి లేదా రెండు ఈవెంట్లలో కనిపించడం తప్ప పెద్దగా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. అయితే లేటు వయసులో ఆమె మళ్ళీ పుస్తకాలు పట్టి 'లా'లో మాస్టర్స్ చేస్తున్నారు.
Read Also : విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే
పూజా హెగ్డే ఇండస్ట్రీలోకి ఇలా...
పూజా హెగ్డే కు ముందుగా సినిమాలలో నటించే ఇంట్రెస్ట్ లేదట. కానీ మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న తర్వాత మోడలింగ్ చేసే ఛాన్స్ రావడంతో అటువైపు అడుగులు వేసింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 'మూగమూడి' అనే తమిళ సినిమా, తెలుగులో 'మాస్క్' అనే టైటిల్ తో రిలీజ్ అయిన మూవీలో ఫస్ట్ టైం నటించింది. తెలుగులో మాత్రం 'ఒక లైలా కోసం' అనే మూవీనే ఆమె ఫస్ట్ మూవీ. హిందీలో 'మొహంజోదారో' అనే భారీ బడ్జెట్ సినిమాలో మొదట్లోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆమె చేసిన ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో పూజా హెగ్డేని ఐరన్ లెగ్ అని పిలిచారు.
అలాంటి టైంలో టాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో పూజా హెగ్డే కెరీర్ పూర్తిగా మారిపోయింది. 'డీజే' మూవీ తర్వాత ఆమె వరుసగా మహర్షి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో వంటి సినిమాలతో లక్కీ గర్ల్ అనిపించుకుంది. ఆ తర్వాత పాన్ ఇండియా ఛాన్సులు వచ్చినప్పటికీ, అదృష్టం కలిసి రాలేదు. దీంతో మరోసారి డిజాస్టర్ ఫేజ్ చూసింది పూజా. కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ వరుస అవకాశాలను పట్టేస్తోంది బుట్ట బొమ్మ.
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

