Kingdom Teaser: విజయ్ దేవరకొండ మాస్ సంభవం... కింగ్‌డమ్ టీజర్ వచ్చిందోచ్, మామూలుగా లేదంతే
Vijay Deverakonda's Kingdom Teaser: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'కింగ్‌డమ్' టైటిల్ ఖరారు చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన టీజర్ విడుదల చేశారు.

VD12 movie Kingdom Teaser Review In Telugu: మాస్... రా అండ్ రస్టిక్... వంటి పదాలు కూడా తక్కువే ఏమో!? విజయ్ దేవరకొండలో ఇంత మాస్ ఉందా? అని అతని ఫ్యాన్స్, గౌతమ్ తిన్ననూరి ఇటువంటి రా అండ్ రస్టిక్ సినిమా తీయగలడా? అని సగటు తెలుగు సినిమా ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ 12వ సినిమా టీజర్ (VD12 Teaser) నేడు విడుదల అయ్యింది.
ఇదీ విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'...
ఫ్యాన్స్, ఆడియన్స్‌కు గూస్ బంప్స్ గ్యారెంటీ
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'మళ్ళీ రావా', 'జెర్సీ' సినిమాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ (VD12 Movie) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు 'కింగ్‌డమ్' (VD12 movie titled Kingdom) టైటిల్ ఖరారు చేశారు.
'కింగ్‌డమ్' టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు సినిమా టీజర్ ఈ రోజు విడుదల చేశారు. మే 30వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఆ టీజర్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. టీజర్ అంతా మాస్ మూమెంట్స్ ఉన్నాయి. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్. గూఢచారిగా విజయ్ దేవరకొండ చేసిన సాహసాలు, పోరాటాలను హైలైట్ చేశారు. షార్ట్ హెయిర్‌లో ఆయన లుక్, ఆ ఎక్స్‌ప్రెషన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్ అయ్యింది. విజయ్ దేవరకొండ మాస్ ఎలివేట్ చేయడంలో హెల్ప్ అయ్యింది. అనిరుధ్ బీజీఎం గూస్ బంప్స్ ఇచ్చిందని చెప్పవచ్చు.
''అలసట లేని భీకర యుద్ధం... అలలుగా పారే ఏరుల రక్తం... వలసపోయినా, అలిసిపోయినా ఆగిపోనిది ఈ మహా రణం... నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృత దేహాలు... ఈ అలజడి ఎవరి కోసం? ఇంత భీభత్సం ఎవరి కోసం? అసలీ వినాశం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని బద్దలుకొట్టి పునర్జన్మ ఎత్తిన నాయకుడి కోసం'' అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా గూస్ బంప్స్ ఇచ్చింది.
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?
'కింగ్‌డమ్' సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. సూర్య వాయిస్ ఓవర్‌తో తమిళ్, రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్‌తో హిందీ టీజర్స్ విడుదల అయ్యాయి.
#VD12 is #KINGDOM 🔥🔥
— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2025
Feel the passion, the emotion and the intensity of our world- in the most raw and powerful voices of our favourite stars💥💥
Telugu — https://t.co/JDGuDPRCBJ
Tamil — https://t.co/X53m1nVtYo
TEASER OUT NOW 😎
Thank You @Tarak9999 garu and @Suriya_offl… pic.twitter.com/wlXzLJzXe8
'పెళ్లి చూపులు'లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో చూశారు. ఉద్యోగం లేని సమయంలో తండ్రితో తిట్లు తింటూ తన ఫ్యాషన్ వైపు అడుగులు వేసే యువకుడిగా ఆయన కనిపించారు. 'గీత గోవిందం'లో అనుకోకుండా జరిగిన తప్పు వల్ల అమ్మాయికి భయపడే పాత్ర చేశారు. 'అర్జున్ రెడ్డి'లో ఎగ్రెస్సివ్ స్టూడెంట్, లవ్ ఫెయిల్యూర్ వల్ల మత్తు మందులకు అలవాటు పడిన యువకుడిగా నటించారు. 'ఫ్యామిలీ స్టార్'లో మిడిల్ క్లాస్ మ్యాన్, 'ఖుషి'లో లవర్ బాయ్ రోల్స్ చేశారు. ఆయన్ను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కొత్త పాత్రలో మాసీగా చూపించారు. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ 'కింగ్‌డమ్' టీజర్ చూశాక కొత్తగా ఫీల్ అయ్యారు.
'లైగర్', 'ఖుషి', 'ఫ్యామిలీ స్టార్' కంటే 'కింగ్‌డమ్' విజయ్ దేవరకొండకు పర్ఫెక్ట్ పాన్ ఇండియా లాంచ్ ప్యాడ్ అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ముందుగా ఈ సినిమా రావాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.





















