Horoscope Today 13th February 2025: ఈ రాశులవారికి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి - ఆర్థికంగా కలిసొస్తుంది!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 13 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశి విద్యార్థులు ఉన్నత చదువుకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. సబార్డినేట్ ఉద్యోగులతో మీ ప్రవర్తనను చక్కగా ఉంచండి. చట్టపరమైన వివాదాలు పరిష్కారం అవుతాయి.
వృషభ రాశి
మీ నిర్ణయాలను ఎదుటివారిపై రుద్దొద్దు. ఉన్నతాధికారులు ఈ రాశి ఉద్యోగులను విస్మరిస్తారు. అధిక ఖర్చులుంటాయి జాగ్రత్త. సాహిత్యంపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ప్రేమికులు ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
మిథున రాశి
నూతన స్నేహితులు ఏర్పడతారు. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. మీరు మీ ప్రణాళికల గురించి కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. తీర్థయాత్ర ఆహ్లాదకరంగా ఉంటుంది. మతంపై విశ్వాసం ఉంచండి.
కర్కాటక రాశి
ఈ రోజు కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికం అవుతుంది. ప్రొఫెషనల్ పనుల కన్నా వ్యక్తిగత వ్యవహారాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ప్రేమ వ్యవహారాల గురించి కుటుంబంలో చర్చ ఉండవచ్చు.
Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!
సింహ రాశి
ఈ రోజు వైవాహిక జీవితంలో తాగాదాలుంటాయి. మీ బాధ్యతలు పెరుగుతాయి. పోటీ పరీక్షలో విద్యార్థులు ఉత్తమ విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు నియంత్రించడం ఎలా అనే విషయంలో ఒత్తిడి చెందుతారు. మీ ప్రవర్తనలో మృదుత్వాన్ని కోల్పోవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
కన్యా రాశి
ఆర్థిక లావాదేవీలు కలిసొస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితం శృంగారభరితంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
తులా రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆస్తి కొనుగోలు, అమ్మకం గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రోజు మీరు పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఒత్తిడిలో ఉండవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.
వృశ్చిక రాశి
ఈ రోజు రహస్య శత్రువుల కారణంగా మీరున్న రంగంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. సృజనాత్మక రచనలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరుల తగాదాలలో మధ్యవర్తిత్వం చేయవద్దు. మీరు ఆన్‌లైన్ వ్యాపారంలో పెద్ద ప్రయోజనం పొందుతారు. పిల్లలతో సంతోష సమయం గడుపుతారు.
Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!
ధనస్సు రాశి
ధనుస్సు రాశివారు ఈ రోజు పెద్ద ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాలకు పెద్దల మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు విద్యలో ఉపాధ్యాయుల సూచనలు లభిస్తాయి. పిల్లల ప్రవర్తన మీకు సంతోషాన్నిస్తుంది. నూతన ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి.
మకర రాశి
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీ ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి.
కుంభ రాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తిచేయడంలో విజయం సాధిస్తారు. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ప్రారంభించిన పనిలో ఉండే అడ్డంకులు సాయంత్రానికి తొలగిపోతాయి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది.
మీన రాశి
ఈ రోజు చాలా మంచి రోజు. మీ సంకల్ప శక్తి ప్రతికూల పరిస్థితులలో మీకు కవచంగా ఉపయోగపడుతుంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. ప్రత్యర్థుల మధ్య మీ ఆధిపత్యం పెరుగుతుంది. రాజకీయాలపై ఆసక్తి చూపిస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

