Bhairathi Ranagal OTT Streaming: మూడు నెలల తర్వాత తెలుగు ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ గ్యాంగ్ స్టర్ డ్రామా... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Bhairathi Ranagal OTT Platform: శివ రాజ్ కుమార్ నటించిన 'భైరతి రణగల్' సినిమా తెలుగులో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం అవుతోంది. ఈ యాక్షన్ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే...

కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'భైరతి రణగల్'. గత ఏడాది రిలీజై, మాస్ ఆడియన్స్ కు థియేటర్లలో మంచి ట్రీట్ ఇచ్చిన ఈ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. శివన్న నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా తెలుగు డిజిటల్ ప్రీమియర్ డేట్ ను తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
తెలుగులో శివన్న గ్యాంగ్ స్టర్ డ్రామా
'భైరతి రణగల్' అనే ఈ కన్నడ మూవీ నవంబర్ 15న థియేటర్లలో రిలీజ్ అయింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న ఈ మూవీ, 45 రోజుల థియేట్రికల్ రన్ తరువాత ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. ఇక 3 నెలల తరువాత ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. నిజానికి ఇప్పటికే 'భైరతి రణగల్' మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 25 నుంచి ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మూవీ రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయబోతున్నామంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే తెలుగు వెర్షన్ మాత్రం వేరే ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది.
అచ్చ తెలుగు ఓటీటీ ఆహా శివన్న నటించిన 'భైరతి రణగల్' అనే ఈ యాక్షన్ థ్రిల్లర్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. "ఒక గ్యాంగ్ స్టర్ ఎప్పుడూ పుట్టలేదు, అతన్ని తయారు చేశారు. ఫిబ్రవరి 13 నుండి అంటే ఈ రోజు నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న 'భైరతి రణగల్' మూవీని చూడండి" అంటూ ఆహా ఈ మూవీ పోస్టర్ షేర్ చేసింది.
View this post on Instagram
చరణ్, విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన మూవీ
శివన్న 'భైరతి రణగల్'లో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. న్యాయవాదిగా, అలాగే గ్యాంగ్ స్టర్ గా ఆయన అదరగొట్టారు. ఈ మూవీకి నర్తన్ దర్శకత్వం వహించగా, రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇందులో శివరాజ్ కుమార్ తో పాటు రాహుల్ బోస్, రుక్మిణి వసంత్, అవినాష్, దేవరాజ్, ఛాయాసింగ్, మధు గురుస్వామి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక 'భైరతి రణగల్' మూవీ ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన 'ముఫ్తీ' అనే సూపర్ హిట్ మూవీకి ప్రీక్వెల్. దీనికి కూడా అప్పట్లో నర్తన్ దర్శకత్వం వహించారు. 'ముఫ్తీ' మూవీలో శివన్నతో పాటు శ్రీ మురళి కూడా సందడి చేశారు. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే... ఇదే స్టోరీని తెలుగులో విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారని టాక్ ఉంది. అయితే ముందుగా యశ్ ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రాశారని, కానీ ఆ తర్వాత ఈ మూవీ శివన్న ఖాతాలో పడిందని ప్రచారం జరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

