Shubman Gill Century: గిల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్, కోహ్లీ ఫిఫ్టీ
ఈ సిరీస్ లో గిల్ ఆల్రెడీ 2 అర్థ సెంచరీలు చేయగా, ఇది తొలి సెంచరీ కావడం విశేషం. తన వన్డే కెరీర్లో ఇది 7 వ సెంచరీ. ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన గిల్ 14 ఫోర్లు, 2 సిక్సర్లు చేశాడు.

Ind Vs Eng 3rd Odi Live Updates: అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఓపెనర్ శుభమాన్ గిల్ సూపర్ సెంచరీ (102 బంతుల్లో 112 నాటౌట్, 14 ఫోర్లు, 3 సిక్సర్లు)తో సత్తా చాటాడు. గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు శుభారంభాన్ని గిల్ అందించాడు. రోహిత్ శర్మ (1) విఫలమైనా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (55 బంతుల్లో 52, 7 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. ఈ మ్యాచ్ లో ఫిఫ్టీ కొట్టి కోహ్లీ కూడా ఫామ్ లోకి వచ్చాడు. ఈ క్రమంలో వీరిద్దరూ రెండో వికెట్ కు 116 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్ లో గిల్ ఆల్రెడీ రెండు అర్థ సెంచరీలు చేయగా, ఇది సెంచరీ కావడం విశేషం. తన వన్డే కెరీర్లో ఇది 7 వ సెంచరీ. గిల్ తన ఇన్నింగ్స్ లో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం సాధించి 14 ఫోర్లు, 3 సిక్సర్లు చేశాడు. ఇక 2023 సెప్టెంబర్ తర్వాత గిల్ సెంచరీ చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ గా గిల్ రికార్డు నమోదు చేశాడు. 50 ఇన్నింగ్స్ ల్లోనే గిల్ ఈ ఘనత సాధించగా, అంతకుముందు ఈ రికార్డు హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్ లు- సౌతాఫ్రికా) పేరిట ఉంది.
బంతికో పరుగు చొప్పున..
మూడో వన్డేలో భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ రోహిత శర్మ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో కాస్త ఒత్తిడిలో ఉన్న టీమిండియాను గిల్, కోహ్లీ ద్వయం ఆదుకుంది. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జంట.. తర్వాత బౌండరీలతో సత్తా చాటింది. ముఖ్యంగా ఒక్కసారి గాడిన పడిన తర్వాత రెండు కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత 7 బౌండరీలు కొట్టి, 51 బంతుల్లో తన ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఇక కోహ్లీ కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించి, అభిమానులను అలరించాడు. ఒక్కసారి కుదురుకున్న తర్వాత కోహ్లీ కూడా తన ట్రేడ్ మార్కు షాట్లతో అలరించాడు. ఈక్రమంలో సరిగ్గా 50 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాక ఔటయ్యాడు. అంతకుముందు ఇంగ్లాండ్ పై 4వేల పరుగులు పూర్తి చసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. సచిన్ రెండో స్థానంలో ఉన్నాడు.
అయ్యర్ తో సూపర్ భాగస్వామ్యం..
కోహ్లీ ఔటయ్యాక నం.4లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో మరో సెంచరీ భాగస్వామ్యాన్ని గిల్ నిర్మించాడు. ఫిఫ్టీ తర్వాత వేగంగా ఆడిన గిల్.. మార్క్ వుడ్ బౌలింగ్ లో బౌండరీ కొట్టి, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అయ్యర్ తో 104 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఆదిల్ రషీద్ బౌలింగ్ లో స్లాగ్ స్వీప్ కు ప్రయత్నించిన గిల్ బౌల్డ్ అయ్యాడు. మొత్తానికి ఈ మైదానంలో అన్ని ఫార్మాట్లలో సెంచరీ పూర్తి చేసుకున్న క్రికెటర్ గా గిల్ నిలిచాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

