అన్వేషించండి

Kannappa music director Stephen Devassy: అమరావతి శంకుస్థాపనలో చితక్కొట్టిన 'కన్నప్ప' మ్యూజిక్ డైరెక్టర్... ఆయనకు సంబంధం ఏంటి?

'కన్నప్ప' మొదటి సాంగ్ విడుదలైన తర్వాత స్టీఫెన్ దేవస్సే ఎవరని ఆరా తీస్తున్నారు. ఆయన పదేళ్ల క్రితమే అమరావతి శంకుస్థాపనలో మ్యూజిక్ షో చేశారు. దేశంలో ఫాస్టెస్ట్ కీబోర్డు ప్లేయర్‌గా గుర్తింపు పొందారు.

'కన్నప్ప' మూవీపై ఇప్పుడు పాజిటివ్ బజ్ నడుస్తోంది. కారణం కొత్తగా ఆ మూవీ నుండి రిలీజ్ అయిన 'శివ శివ శంకరా....' పాట. తెలుగులో తొలిసారి మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న స్టీఫెన్ దేవస్సే ఈ ఒక్క పాటతో 'కన్నప్ప' సినిమాపై పాజిటిక్ వైబ్ తెచ్చాడంటూ ఆడియన్స్ అంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ నడుస్తోంది. మంచు విష్ణు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 'కన్నప్ప' సినిమాకు ఇది ఒక మేలు చేకూర్చే అంశమని చెప్పొచ్చు. అయితే స్టీఫెన్ దేవస్సే పదేళ్ల క్రితమే ఆంధ్రుల రాజధాని 'అమరావతి' సాక్షిగా తెలుగు వాళ్ళను పలకరించాడు. 

శివమణితో కలిసి తెలుగు వాళ్ళని అలరించిన స్టీఫెన్
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం దాన్ని శంకుస్థాపన కోసం ప్రధాని మోదీని అమరావతికి ఆహ్వానించింది. అక్టోబర్ 22, 2015న ఉద్దండ రాయుని పాలెం వద్ద ప్రధాని మోదీ స్వయంగా అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు, అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని అలరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం 'శివమణి - స్టీఫెన్ దేవస్సే'ల మ్యూజిక్ షో.

అంతవరకూ శివమణి డ్రమ్స్ టాలెంట్ గురించి తెలిసిన తెలుగు వాళ్లను స్టీఫెన్ తన కీ బోర్డు టాలెంట్‌తో మెస్మరైజ్ చేశాడు. ఆ రోజు ఆ ప్రోగ్రాం అరేంజ్ చేసింది నారా లోకేష్ అని చెబుతారు. సంప్రదాయ, మోడ్రన్ సంగీతాల కలయికతో  శివమణి, స్టీఫెన్ ఇచ్చిన మ్యూజికల్ షో ఇప్పటికీ యూట్యూబ్‌లో పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. దానితో స్టీఫెన్‌కు తెలుగులో అభిమానులు ఏర్పడ్డారు. కానీ ఆయన ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీపై పెద్దగా దృష్టి పెట్టలేదు. 10 ఏళ్ల తర్వాత 'కన్నప్ప' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తొలిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు స్టీఫెన్ దేవస్సే. 

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?

ఎవరీ స్టీఫెన్ దేవస్సే? ఆయన నేపథ్యం ఏమిటి?
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన స్టీఫెన్ చాలా చిన్న వయసులోనే మ్యూజిక్ రంగంలో అడుగు పెట్టాడు. సంగీత రంగంలో తన ప్రతిభను చూసిన హరిహరన్ తనతో పాటు యూరోప్‌లో జరిగే మ్యూజిక్ షోలకు స్టీఫెన్ దేవస్సేను తీసుకువెళ్లాడు. అప్పటికి అతని వయసు 18 ఏళ్లు మాత్రమే. మరో ఏడాదికే మరి కొందరితో కలిసి సొంతంగా ఒక మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేశాడు స్టీఫెన్. రిలీజ్ చేసిన 'యే జిందగాని' ప్రవేట్ ఆల్బమ్ పెద్ద హిట్ అయింది. దానితో మలయాళ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం రావడంతో 2003 నుండి తనకు నచ్చిన సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ వస్తున్నారు స్టీఫెన్. అటు వెస్ట్రన్ ఇటు క్లాసికల్ మ్యూజిక్‌లో సమాన ప్రతిభ గల స్టీఫెన్ టాలీవుడ్ ఎంట్రీకి మాత్రం చాలా టైం తీసుకున్నాడు. చివరకు మంచు విష్ణు భారీ ఖర్చుతో నిర్మిస్తున్న 'కన్నప్ప' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగులో అడుగుపెడుతున్నారు స్టీఫెన్ దేవస్సే. తన తొలిపాటతోనే సినిమాపై వైబ్ పూర్తిగా మార్చేసిన స్టీఫెన్ భవిష్యత్తులో మరెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. అన్నట్టు వివిధ భాషల్లో చాలా మ్యూజిక్ షోలకు జడ్జి గానూ.. గెస్టుగానూ వెళ్లిన స్టీఫెన్ 2020-21లో సోనీ టీవీలో ప్రసారమైన 'ఇండియన్ ఐడియల్ 2'లో మన తెలుగు అమ్మాయి 'షణ్ముఖ ప్రియ'కు మెంటర్‌గానూ తన సహకారం అందించిన సంగతి తెలుగు సంగీత ప్రియులకు ఇంకా గుర్తున్న విషయమే.

Also Readవైసీపీకి బుల్లిరాజు వార్నింగ్... 'సంక్రాంతికి వస్తున్నాం' బుడ్డోడి వైరల్ ట్విట్టర్ పోస్టులో నిజమెంత?

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget