Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్, విమర్శలపై యశ్ రియాక్షన్
Yash Reaction : టాక్సిక్ మూవీలో వయలెన్స్, రొమాంటిక్ సీన్స్‌పై మొదటి నుంచి సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో యశ్ వీటిపై రియాక్ట్ అయ్యారు.

Yash's Reaction Over Toxic Movie Trollings : కన్నడ స్టార్ యశ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. రాయగా యశ్ ఫస్ట్ లుక్ ఇంట్రడ్యూస్ చేసిన నుంచి స్పెషల్ వీడియోస్, సాంగ్స్‌లో రొమాంటిక్ సీన్స్ కొంచెం ఎక్కువగానే కనిపించాయి. దీంతో మొదటి నుంచి ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ట్రోలింగ్స్ సాగాయి. రీసెంట్ ట్రైలర్‌లోనూ యాక్షన్, వయలెన్స్ ఎక్కువగానే ఉంది. దీనిపై హీరో యశ్ రియాక్ట్ అయ్యారు.
'అది వారి లోపం'
టాక్సిక్ అనేది కేవలం యశ్ సినిమా మాత్రమే కాదని... ఇది ఇండియన్ సినిమా అని అన్నారు యశ్. 'మా ప్రయత్నాన్ని ఆడియన్స్ అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఆ తర్వాత అందరి ఆలోచనల్లో మార్పు వస్తుంది. మేము ఎంత ముందుచూపుతో ఈ మూవీ చేశామో మీకే అర్థమవుతుంది. నటీనటులంతా ఎన్నో త్యాగాలు చేసి ఈ మూవీ ఒకే వేదికపై నిలబెట్టాలనే ఒకే ఒక లక్ష్యంతో వర్క్ చేశారు.
చాలా మంది ఈ మూవీ గురించి నెగిటివ్‌గా మాట్లాడారు. కానీ, నేను ఎవరి మాటలు వినను. అలా విమర్శించే వారి ఊహాశక్తి లోపం ఉందని అనుకుంటాను. కష్టపడితే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదు.' అని అన్నారు.
కియారాపై ప్రశంసలు
హీరోయిన్ కియారాపై యశ్ ప్రశంసలు కురిపించారు. 'కియారా... సినిమాలో గొప్ప పాత్ర పోషించావు. ట్రైలర్‌లో కనిపించింది కొంచెంసేపే అయినా ఆ చిన్న సీన్స్‌లోనే నీ కష్టమంతా కనిపించింది. ప్రముఖ నటీనటులను ఓచోట చేర్చినప్పుడు అనేక సమస్యలు వస్తాయేమోనని తొలుత అనుకున్నాం.
కానీ, కియారా ఈ ప్రాజెక్టులో భాగమైనప్పటి నుంచీ చాలా వినయంగా ఉంటూ... తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. నేనూ ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరి మాటలను పట్టించుకోకుండా మనం చేయాల్సింది చేస్తూ వెళ్లడమే. ప్రజలు కచ్చితంగా నిన్ను అభినందిస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది.' అంటూ చెప్పారు.
గ్యాంగ్ స్టర్ పాత్రలో నయన్
ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్స్ ఉండగా... గంగ పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. తన రోల్ గురించి ఈవెంట్‌లో మాట్లాడిన ఆమె... ఈ ప్రాజెక్టుపై ముందు తాను ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పారు. 'ఎక్కువ మంది స్టార్స్ ఉన్న సినిమాలను ఎంచుకోవడానికి నేను భయపడతాను. అందుకే ముందు నేను చేయలేనని చెప్పేశా. గీతూ మోహన్ దాస్ నాకు కథ వినిపించినప్పటి నుంచీ నా ఆలోచన మారిపోయింది. ఇంత గొప్ప దర్శకురాలిని మనం ఇప్పటివరకూ ఎందుకు చూడలేదు అనిపించింది. యశ్ ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేశారు.' అని అన్నారు.
ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా... కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ నటిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ వరల్డ్ వైడ్‌గా తెలుగుతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీష్, మలయాళం భాషల్లో వరల్డ్ వైడ్ ఆగస్ట్ 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Korean Kanakaraju Collections Day 2 : కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు























