Bulli Raju Twitter Account: వైసీపీకి బుల్లిరాజు వార్నింగ్... 'సంక్రాంతికి వస్తున్నాం' బుడ్డోడి వైరల్ ట్విట్టర్ పోస్టులో నిజమెంత?
Revanth Bhimala Twitter Account: సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బుల్లి రాజుగా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల. లైలా సినిమాకు ప్రమోషన్ చేశాడు. అతని ట్విట్టర్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ దంపతుల తనయుడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు ఉన్నాడా? ఆ చిన్నారి పేరు రేవంత్ భీమల (Revanth Bhimala). అసలు పేరు కంటే సినిమాలో పేరు బుల్లి రాజుగా ఎక్కువ పాపులర్. ఈ చిన్నారి అభినయానికి ఫ్యాన్ కానీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. తన నటనతో, డైలాగ్ డెలివరీతో అందరినీ నవ్వించిన రేవంత్ భీమల పేరు ఇప్పుడు ఒక వివాదంలో వినబడుతోంది.
పేటీఎమ్స్... బాయ్ కాట్ అంటారా?
మా లైలా పిన్ని కోసం నేనున్నాను!
విశ్వక్ సేన్ తాజా సినిమా 'లైలా' (Laila Movie) ప్రీ రిలీజ్ వేడుకలో 30 ఇయర్స్ పృథ్వీ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో సినిమాను బాయ్ కాట్ చేయమని పిలుపు ఇస్తున్నారు. చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వేదిక మీద పృథ్వీ ఆ వ్యాఖ్యలు చేశారని, అతనితో మా సినిమాకు సంబంధం లేదని, తమ సినిమాను రాజకీయాలతో ముడి పెట్టవద్దని విశ్వక్ సేన్ విజ్ఞప్తి చేశారు. పృథ్వీ రాజ్ చేత క్షమాపణలు చెప్పించమని వైసీపీ సోషల్ మీడియా వింగ్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 'లైలా' సినిమాకు బుల్లి రాజు ఒక ప్రమోషనల్ వీడియో చేశాడు. సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది.
''అరేయ్... పేటీఎమ్స్! మీరు బాయ్ కాట్ అంటే ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. మా లైలా పిన్ని కోసం నేనున్నా. అందుకే నేను ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్ రా సోను (విశ్వక్ సేన్). సినిమా బ్లాక్ బస్టర్ పక్కా. లైలా సినిమాకు మద్దతు ఇవ్వండి'' అంటూ ఒక ట్విటర్ పోస్ట్ వైరల్ అవుతోంది. పేరు బుల్లి రాజు అని ఉండడంతో అందరూ ఆ అకౌంట్ రేవంత్ భీమలదే అనుకున్నారు. అందులో నిజం లేదంటూ ఆ చిన్నారి తండ్రి ఒక పోస్ట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రేవంత్ భీమల పేరుతో ఒక అకౌంటు ఉంది. దానిని ఆ చిన్నారి తండ్రి శ్రీనివాసరావు మెయింటైన్ చేస్తున్నారు. తన కుమారుడి పేరుతో ఎటువంటి ట్విట్టర్ అకౌంట్ లేదని, ప్రస్తుతం ఉన్న అకౌంట్ ఫేక్ అని ఆయన స్పష్టత ఇచ్చారు.
''అందరికీ నమస్కారం, మా అబ్బాయి చిరంజీవి రేవంత్ నటించిన పాత్రను ఇటీవల విడుదల అయ్యి ఘన విజయం సాధించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ద్వారా ఆదరించి ఆశీస్సులు అందజేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియా (X) వేదికగా మా అబ్బాయి పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సినిమా ప్రమోషన్ కోసం చేసిన వీడియోలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మా అబ్బాయికి సంబంధించిన అధికారిక వివరాలు అప్డేట్స్ సోషల్ మీడియాలో కేవలం రేవంత్ భీమల (@revanth_bhimala) అనే పేరు మీద ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాం.
ఇది తప్ప ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మాకు ఎటువంటి ఇతర అకౌంట్ ఛానల్స్ లేవు. తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్న విషయమై పోలీస్ వారికి ఫిర్యాదు చేశాం. దయచేసి మాకు, ముఖ్యంగా మా అబ్బాయిని ఇటువంటి వివాదాలు రాజకీయాలతో ముడి పెట్టవద్దని అన్ని మీడియా వేదికలకు తెలియజేస్తున్నాం. ఇట్లు, బి శ్రీనివాసరావు'' అని ఒక లేఖ విడుదల చేశారు. అది సంగతి.
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

