Telangana: బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై నెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Telangana: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశంలో తీర్మానం చేసి కేంద్రానికిపంపాలనే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది. అయితే ప్రభుత్వం మోసం చేసిందని ఎదురుదాడి చేసేందుకు బీఆర్ఎస్ రెడీగా ఉంది.

Revanth government is planning to pass a resolution on BC reservation in Telangana: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అయితే ఇటీవల అసెంబ్లీలో రేవంత్ ప్రసంగించినప్పుడు రాజ్యాంగసవరణ అని ప్రకటించారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అలా తెలిసి కూడా బీసీ డిక్లరేషన్ లో 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రకటించారు. అంటే చేసి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే కులగణన చేపట్టి..యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగంలో ఎత్తివేసి అమలు చేసేవారేమో కానీ ఇప్పుడైతే ఆ చాన్స్స లేదు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే ఆ వర్గం వారు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. అయితే తమ ప్రయత్నం తాము సిన్సియర్ గా చేస్తున్నామన్న భావన కల్పించేందుకు కులగణన చేపట్టారు. అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించారు.కలగణన వివాదాస్పదంగా మారడంతో రీ సర్వేకు నిర్ణయం తీసుకున్నారు. పేర్లు నమోదు చేసుకోని మూడు శాతం మంది కోసం రీ సర్వే అని చెబుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశ పెట్టారు. రీ సర్వేతో వచ్చే సమస్యలను అధిగమించి కొత్తగా నివేదిక తయారు చేయాల్సి ఉంది. పదేళ్ల కిందట కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే జనాభా తగ్గిపోయారని.. బీసీలను ఐదున్నర శాతం మేర తగ్గించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేదుకు రీసర్వే నిర్వహిస్తున్నారు
రీసర్వే కూడా పూర్తి అయిన తర్వాత అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించే అవకాశం ఉంది. అలా ఆమోదించిన వెంటనే రిజర్వేషన్లు వస్తాయా అంటే.. చాన్స్ లేదని చెప్పుకోవచ్చు. అలా కల్పిస్తే రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం దాటిపోతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెల్లవు. ఒక వేళ మొండిగా ఎన్నికల ప్రకటన ఇస్తే కోర్టు కేసుల్లో చిక్కుకుంటుందది. అసలు ఎన్నికలు జరగకుండా పోతాయి. అందుకే అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల తీర్మానం చేసి.. దాన్ని కేంద్రానికి పంపాలనుకంటున్నారు. ఆ తర్వాత జాతీయ నేతలందర్నీ కలిసి తెలంగాణలో ఓబీసీ రిజర్వేషన్లు 42 శాతం చేస్తున్నామని దానికి మద్దతు ఇవ్వాలి అడిగే అవకాశాలు ఉన్నాయి.
అయితే కేంద్రం వద్ద ఇలాంటి తీర్మానాలు దాదాపుగా ప్రతి రాష్ట్రం నుంచి ఉన్నాయి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో ఆయా తీర్మానాలను చేరిస్తే.. రిజర్వేషన్లు ఇవ్వొచ్చు. ఇలా చేయాలంటే రాజ్యాంగసవరణ చేయాలి. కేంద్రం అలాంటి ప్రయత్నం చేయదు. రాజకీయ అవసరాల కోసం పార్టీలు చేసే తీర్మానాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉండదని అనుకుంటుంది. అందుకే కేటీఆర్ రేవంత్ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. కేంద్రంపై నెపం వేసి తప్పించుకుంటామంటే కుదరన్నారు.
కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం..
— KTR (@KTRBRS) February 12, 2025
అయితే బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.
అసమగ్రంగా…
రిజర్వేషన్ల సంగతి తేలే అవకాశం లేదు. అందుకే ఓ వైపు ప్రయత్నాలు చేసి... రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు ఇద్దామని రేవంత్ రెడ్డి సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే స్థానిక ఎన్నికలను కులగణన రీ సర్వే కోసం ఆపుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత జాతీయ నేతల్ని కలిసి తమ ప్రయత్నాలు తాము చేశామని చెప్పుకుని స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

