అన్వేషించండి

Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?

Kerala: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్థానిక అంశాలే కాకుండా, అంతర్జాతీయ పరిణామాలు కూడా తీర్పును ప్రభావితం చేయబోతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ పరిస్థితుల ఆగ్రహం ఎవరిపై పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Gulf War is having an impact on the Kerala Assembly elections:   కేరళ రాజకీయాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని కలిగి ఉంటాయి. ఇక్కడి ఓటరు చైతన్యం దేశానికే ఆదర్శం. అయితే, ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్థానిక అంశాలే కాకుండా, అంతర్జాతీయ పరిణామాలు కూడా తీర్పును ప్రభావితం చేయబోతున్నాయి. ముఖ్యంగా కేరళ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే  ప్రవాస కేరళీయుల   స్థితిగతులు,  పెరుగుతున్న వలస కార్మికుల  ప్రభావంపై ఈసారి ప్రధాన పార్టీలైన ఎల్డీఎఫ్, యూడీఎ,  బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

రెమిటెన్స్ సంక్షోభం 

దశాబ్దాలుగా కేరళ అభివృద్ధిలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నిధులు   కీలక పాత్ర పోషించాయి. అయితే, ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాల్లో మారిన నిబంధనలు, అక్కడి స్వదేశీకరణ  విధానాల వల్ల వేలాది మంది కేరళీయులు ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. ఒకప్పుడు విదేశీ నగదుతో కళకళలాడిన గ్రామాలు ఇప్పుడు నిరుద్యోగంతో నిశ్శబ్దంగా మారుతున్నాయి. తిరిగి వచ్చిన ప్రవాసుల పునరావాసం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అరకొరగానే ఉన్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ  రిటర్న్ మలయాళీ  వర్గం ఈసారి ఎన్నికల్లో ఎటు మొగ్గు చూపుతుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు దీనికి యుద్ధ ప్రభావం కూడా తోడైంది. 

మారుతున్న జనాభా ముఖచిత్రం 

మరోవైపు, కేరళలో కూలీల కొరతను భర్తీ చేసేందుకు పశ్చిమ బెంగాల్, బిహార్, అస్సాం వంటి రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు ఇప్పుడు అక్కడి సమాజంలో అంతర్భాగమయ్యారు. వీరి సంఖ్య లక్షల్లో ఉండటంతో, వీరిని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించే అంశంపై పార్టీల మధ్య పోటీ నెలకొంది. వీరి ప్రభావం ముఖ్యంగా ఎర్నాకుళం, పెరుంబావూర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కేరళలో మైనారిటీ ఓట్లు ఎప్పుడూ నిర్ణయాత్మకమే. అయితే, ఈసారి క్రైస్తవ ఓటు బ్యాంకులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు కంచుకోటగా ఉన్న ఈ వర్గం, ఇప్పుడు రబ్బర్ ధరల పతనం,మతపరమైన భద్రత' వంటి కారణాలతో ఎల్డీఎఫ్ వైపు , బీజేపీ  వైపు చూస్తోంది. ముఖ్యంగా మధ్య కేరళలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది యూడీఎఫ్ మనుగడకు సవాలుగా మారగా, పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ దీనిని అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది.

 త్రిముఖ పోరులో  మెట్రో  వ్యూహం 

బీజేపీ ఈసారి కేరళలో తన ఉనికిని కేవలం ఓట్ల శాతానికే పరిమితం చేయకూడదని పట్టుదలతో ఉంది. మోదీ బ్రాండ్ ఇమేజ్, కేంద్ర పథకాల ప్రచారం ,సురేష్ గోపి వంటి సెలబ్రిటీ నేతల చరిష్మాను నమ్ముకుంది. హిందూ ఓట్ల ఏకీకరణతో పాటు, అసంతృప్త క్రైస్తవ వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా త్రిముఖ పోటీని సృష్టించాలని యోచిస్తోంది. ఒకవేళ బీజేపీ కొన్ని కీలక స్థానాల్లో గణనీయమైన ఓట్లు సాధిస్తే, అది ఎల్డీఎఫ్, యూడీఎఫ్.. ఎవరి కొంప ముంచుతుందో చెప్పలేము.

ఈసారి కేరళ ఎన్నికలు కేవలం  లెఫ్ట్  వర్సెస్ రైట్  మధ్య పోరు మాత్రమే కాదు. ఇది వలస వెళ్ళిన వాడి ఆవేదనకు, వలస వచ్చిన వాడి భవిష్యత్తుకు , నిలదొక్కుకోవాలనుకుంటున్న రాజకీయ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధంగా మారుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget