Bird Flu Outbreaks : బర్డ్ ఫ్లూ సమయంలో చికెన్, ఎగ్ తినకూడదా? ఒకవేళ తినాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Bird Flu Alert in Telugu States : బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా? లేదా? నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటి? చికెన్ లవర్స్ బ్రేక్ తీసుకోవాల్సిందేనా? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

Safety Guidelines for Consuming Chicken and Egg : తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయపెడుతుంది. లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ నేపధ్యంలో చికెన్, గుడ్లు తినొద్దని సూచిస్తున్నారు అధికారులు. అయితే ఈ విషయం చికెన్ లవర్స్‌ని కాస్త ఇబ్బంది పెడుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు ఫాలో అయి చికెన్ తినొచ్చని కూడా నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న సమయంలో చికెన్ తినొచ్చా? తింటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు చికెన్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. అయితే మీరు కచ్చితంగా చికెన్ తినాలనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. చికెన్ వండక ముందు.. వండుతున్నప్పుడు.. తినేప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో.. నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కోడి మాంసాన్ని చేతులతో పట్టుకునే ముందు, తర్వాత కూడా కచ్చితంగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. బర్డ్‌ఫ్లూ సమయంలో చికెన్‌ని వండుకోవాలంటే.. కనీసం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించుకోవాలి. అప్పుడు దానిలోని వైరస్లు పూర్తిగా చనిపోతాయి. కనీసం 20 నుంచి 30 నిమిషాలు చికెన్‌ని కచ్చితంగా ఉడికించుకోవాలి.
వండని చికెన్‌ను స్టోర్ చేయాలనుకుంటే.. వాటిని ఇతర ఫుడ్స్‌కి దూరంగా ఉంచాలి. దానికి ఉపయోగించి పాత్రలు, కత్తులను శుభ్రంగా వాష్ చేసి డ్రై చేసుకోవాలి. చికెన్‌ను ఎక్కడపడితే అక్కడ కాకుండా.. మీకు బాగా నమ్మకముండే ప్రదేశాల్లో కొనుగోలు చేయడం మంచిది. లైసెన్స్ ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్, సూపర్ మార్కెట్లలో తీసుకోవచ్చు.
చికెన్ తినేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చికెన్ వండేప్పుడే కాదు.. తినేప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరిగ్గా ఉడకని, పచ్చి చికెన్‌ను అస్సలు తీసుకోకూడదు. పూర్తిగా ఉడికిన మాంసాన్నే తినాలి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కొన్ని రోజులు చికెన్ తినకపోవడమే మంచిది. కోళ్ల ఫారమ్‌ని విజిట్ చేయడం వంటివి మానుకోవాలి.
గుడ్లు పరిస్థితి ఏంటి? తినొచ్చా?
బర్డ్ ఫ్లూ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో చికెన్‌తో పాటు ఎగ్స్కి కూడా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ గుడ్డు తినాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? అసలు గుడ్డు తినొచ్చా? అంటే.. కచ్చితంగా తినొచ్చు.. కానీ కేవలం ఉడకబెట్టిన ఎగ్స్ మాత్రమే తినాలి. ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ జోలికి వెళ్లకూడదని చెప్తున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల వైరస్ ఎఫెక్ట్ ఉండదని సూచిస్తున్నారు.
రెగ్యులర్‌గా న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలి. బర్డ్ ఫ్లూపై ఆరోగ్య నిపుణులు ఇచ్చే సూచనలు ఫాలో అవ్వాలి. లోకల్‌గా ఇచ్చే హెల్త్ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలి. చికెన్ తినడంపై ఆంక్షాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి.
Also Read : చికెన్ లివర్ అంటే ఇష్టమా? బాగా తింటారా? అయితే ఇది మీకోసమే.. మగవారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

