అన్వేషించండి

Chicken Liver : చికెన్ లివర్ అంటే ఇష్టమా? బాగా తింటారా? అయితే ఇది మీకోసమే.. మగవారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి

Facts about Chicken Liver : కొందరు చికెన్ లివర్​ని చాలా ఇష్టంగా తింటారు. మరికొందరు దాని జోలికే వెళ్లరు. మరి ఈ చికెన్ లివర్​ని తినొచ్చా? లేదా? డైటీషియన్లు ఇచ్చే సూచనలు ఏమిటి?

Chicken Liver Benefits : చికెన్ ప్రోటీన్​కి మంచి సోర్స్​గా చెప్తారు. అందుకే దీనిని డైట్​ చేసే వాళ్లు ప్రోటీన్​ సోర్స్​గా తీసుకుంటారు. అయితే దీనిని హెల్త్​ గురించే కాదు.. టేస్ట్​ గురించి కూడా చాలామంది చికెన్​ తింటూ ఉంటారు. మరికొందరికి ఆదివారమంటే చికెనే ముందు గుర్తు వస్తుంటుంది. అయితే చికెన్​ని ఎంత ఇష్టంగా తింటారో.. దాని లివర్​ని కూడా కొందరు అంతే ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. కానీ మరికొందరేమో దాని జోలికే వెళ్లరు. మరి చికెన్​ లివర్​ని తినొచ్చా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

చికెన్​ లివర్​ని బేషుగ్గా తినొచ్చని చెప్తున్నారు డైటీషియన్లు. మీరు నాన్​వెజ్​ని ఇష్టపడేవారు అయితే చికెన్​ లివర్​ మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని చెప్తున్నారు. దీనిలో హెల్త్​కి ప్రయోజనాలు అందించే ఎన్నో న్యూట్రిషియన్స్ ఉంటాయంటున్నారు. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి 12 వంటి న్యూట్రిషనల్ వాల్యూస్​తో నిండి ఉంటుంది. అలాగే ఫోలేట్, కాపర్, సెలెనీయంతో నిండి ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు అందిస్తుందని చెప్తున్నారు. ఇంతకీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే.. 

ఆరోగ్య ప్రయోజనాలివే..

మీకు రక్తహీనత ఉంటే.. చికెన్ లివర్ కచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలోని బి 12 రక్తహీనతను కంట్రోల్ చేస్తుంది. రక్తహీనతతో ఇబ్బంది పడే మహిళలు దీనిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంతో పాటు.. హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది. లివర్ హెల్త్​కి కూడా ఇది మంచిది. 

పురుషులకు చాలా మంచిదట

సంతానోత్పత్తిని పెంచడంలో చికెన్ లివర్ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా పెంచి.. లైంగికంగా హెల్తీగా ఉండేలా చేస్తుంది. స్ట్రెస్ ఉన్నవారు కూడా దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. అందుకే దీనిని హాయిగా తీసుకోవచ్చు. అయితే దీనిని ఎలా తీసుకోవచ్చు? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? 

వాళ్లు తీసుకోకపోవడమే మంచిది..

వీటిని ఫ్రై చేసి మెయిన్ డిష్​గా తీసుకోవచ్చు. లేదంటే సూప్స్ చేసుకుని తాగవచ్చు. గ్రిల్ చేసుకుని సైడ్ డిష్​గా కూడా తీసుకోవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం దీనికి దూరంగా ఉంటే మంచిది. హై కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా దీనిని దూరం పెడితే మంచిది. సరిగ్గా కుక్ చేయకుండా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. అందుకే వీటిని వండేప్పుడు క్లీనింగ్ చాలా పర్​ఫెక్ట్​గా చేసి.. బాగా ఉడికించి తీసుకోవాలి. చిన్నపిల్లలకి కూడా దీనిని పెట్టొచ్చు. కానీ లిమిట్లో పెడితే మంచిదంటున్నారు. 

Also Read : బరువు తగ్గేందుకు చికెన్ మంచిదా? పనీర్ మంచిదా? నిపుణులు సలహాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Embed widget