APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ హాల్‌టికెట్స్ వచ్చేస్తున్నాయి
APPSC Group -II Mains Hall Tickets: ఏపీపీఎస్సీ గ్రూప్-2 2023 మెయిన్స్ హాల్ టికెట్స్‌కు సంబంధించి వెబ్‌నోట్ విడుదల చేసింది. ఫిబ్రవరి 13 నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.

APPSC Group -II Mains Examination Hall Tickets: ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక అప్టేడ్ ఇచ్చింది. గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల హాల్‌టికెట్లను ఫిబ్రవరి 13 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫిబ్రవరి 12న అధికారక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 2 అభ్యర్థులకు ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఫిబ్రవరి 13 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఫిబ్రవరి 23న ఆఫ్‌లైన్ విధానంలో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి 12. 30 వరకు పేపర్- 1.. మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 వరకు పేపర్- 2 పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో గతేడాది (2024) ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి తర్వాత దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే గతేడాది జూన్ లేదా జులైలో మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. అభ్యర్థుల వినతుల మేరకు పరీక్ష వాయిదావేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.
గ్రూప్-2 మెయిన్ పరీక్ష విధానం..
ఆంధ్రప్రదేశ్‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి 2023, ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జవనరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
పోస్టుల వివరాలు..
* గ్రూప్-2 పోస్టులు
ఖాళీల సంఖ్య: 897
➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 331
➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566
ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..
➥ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 04 పోస్టులు
విభాగం: ఏపీ మున్సిపల్ కమిషనర్స్ సబార్డినేట్ సర్వీస్.
➥ సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబార్డినేట్ సర్వీస్.
➥ డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
విభాగం: ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్.
➥ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
విభాగం: ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్.
➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్.
➥ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్
➥ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 150 పోస్టులు
విభాగం: ఏపీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ సర్వీస్.
➥ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్.
నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు
విభాగం: ఏపీ లెజిస్లేచర్ సబార్డినేట్ సబ్ సర్వీస్.
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్.
➥ సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సబ్ సర్వీస్.
➥ ఆడిటర్: 10 పోస్టులు
విభాగం: పే & అకౌంట్ సబార్డినేట్ సర్వీస్.
➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.
➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ (డిస్ట్రిక్ట్) సబ్ సర్వీస్
➥ సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
విభాగం: ఏపీ వర్క్స్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.
➥ జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.
➥ జూనియర్ అసిస్టెంట్: 240 పోస్టులు
విభాగం: వేర్వేరు విభాగాలు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

