అన్వేషించండి

2-2-2 Method for Weight Loss : బరువు తగ్గేందుకు 2-2-2 రూల్.. ఈ టెక్నిక్​ని ఫాలో అయితే ఇట్టే ఫిట్​గా మారిపోవచ్చు

Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈజీ టెక్నిక్​తో బరువు తగ్గి, ఫిట్​గా ఎలా మారవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

Lose Weight with the 2-2-2 Method : బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తూ.. డైట్ మారుస్తూ వివిధ ప్రయోగాలు అన్ని చేస్తూ ఉంటారు. అయితే 2-2-2 రూల్​ ఫాలో అవుతూ.. బరువును తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయవచ్చని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఈ 2-2-2 ట్రెండ్ ఏంటి? ఇది బరువును వేగంగా తగ్గి, ఫిట్​గా మారడంలో ఎలా హెల్ప్ చేస్తుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2-2-2 అర్థమిదే.. 

బరువును తగ్గించడంలో వ్యాయామం, ఫుడ్, నీళ్లు, లైఫ్​స్టైల్​ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటన్నింటినీ కవర్​ చేస్తూ.. ఈ 2-2-2 పద్ధతిని అమలులోకి తీసుకొచ్చారు. దీనిలో భాగంగా రోజుకు 2 పండ్లు, 2 కూరగాయలు, 2 లీటర్ల నీళ్లు, 2సార్లు వాకింగ్ చేయాలని అర్థం. దీనివల్ల సమతుల్య ఆహారం శరీరానికి అందడమే కాకుండా.. నీళ్లు శరీరానికి హైడ్రేషన్​ అందించి.. బరువును తగ్గించడంలో మంచి ప్రయోజనాలు ఇస్తుందని చెప్తున్నారు నిపుణులు. 

డైటీషియన్లు కూడా బరువు తగ్గేందుకు ఈ రూల్ ఫాలో అవ్వొచ్చని మద్ధతు ఇస్తున్నారు. బరువును తగ్గించడంలో హైడ్రేషన్ కీ పార్ట్​గా చెప్తూ.. ఈ రూల్​లో రెండు లీటర్ల నీటిని తాగేలా ప్లాన్ చేశారు. రోజుకు రెండు లేదా మూడు లీటర్ల నీళ్లు తాగితే మంచిది కానీ.. దీనిని ఫాలో అవ్వని వారు ఈ రూల్​లో భాగంగా కనీసం రోజుకు 2 లీటర్ల నీళ్లు తాగుతారని.. దీనివల్ల బరువు తగ్గడమే కాదు.. ఫిట్​గా మారడంలో హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. 

పండ్లు, కూరగాయలు

ఫుడ్ తింటారు కానీ చాలామంది దానిలో ఫ్రూట్స్, వెజిటెబుల్స్​ని ఇన్​క్లూడ్ చేయరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. రోజుకు రెండు పండ్లు, రెండు కూరగాయలు తినమంటున్నారు. వీటిలోని పోషకాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫైబర్ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. వీటిని స్నాక్స్​గా తీసుకోవడం వల్ల ఇతర అన్​ హెల్తీ స్నాక్స్ జోలికి వెళ్లకుండా ఉంటారు. 

రోజుకు రెండుసార్లు వాకింగ్ చేయడమనేది కచ్చితమైన పనిగా పెట్టుకోవాలి. 6-6-6 రూల్​లో కూడా మీరు ఇదే ఫాలో అవుతారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే కలిగే బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు. ఇది శారీరక శ్రమకిందకి వస్తుంది. గుండె పనితీరును, మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు కేలరీలను బర్న్ చేస్తుంది. జిమ్​కి వెళ్లే తీరిక లేనివారికి ఇదో మంచి వ్యాయామంగా మారుతుంది. 

Also Read : 6-6-6 వాకింగ్ రూల్ అంటే ఇదే.. ఈ రొటీన్ ఫాలో అయితే బరువు తగ్గడంతో పాటు మరెన్నో బెనిఫిట్స్

మార్పులు - చేర్పులు

ఈ 2-2-2 రూల్ ఫాలో అవుతూ బరువు తగ్గాలనుకుంటే అనారోగ్యకరమైన స్నాక్స్​ను హెల్తీ ఫుడ్​తో బర్తీ చేయాలి. పండ్లు, కూరగాయలతో సలాడ్స్ చేసుకోవచ్చు. కూల్ డ్రింక్స్​కి దూరంగా ఉండాలి. మీరు తినే భోజనంతో పాటు కూరగాయలు తీసుకుంటే మంచిది. పోషకాహారం అందిస్తూ.. హైడ్రేటెడ్​గా ఉంటూ బరువు తగ్గడంలో ఇది హెల్ప్ చేస్తుంది. 

దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు

బరువు తగ్గేందుకు ఏ పద్ధతి ఫాలో అయినా దానిలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. వాటిని గుర్తించి కేర్ తీసుకుంటే.. మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2-2-2 రూల్​లో ప్రతికూలతలు ఏంటి అంటే.. ఫుడ్​ విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవాలి. వయసు, శారీరక శ్రమ, మెటబాలీజం ఆధారంగా రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి వెంటనే రిజల్ట్స్ వస్తాయని.. లేదా రాలేదని నిరుత్సాహపడకుండా.. హెల్తీ రొటీన్​ని ఫాలో అయిపోవాలి. 

Also Read : వేగంగా నడిస్తే బరువు తగ్గుతారా లేదా వెనక్కి నడిస్తే చేస్తే మంచిదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
AP DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP DesamAshutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
AP DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Robinhood First Review: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
Robinhood Movie: నితిన్ 'రాబిన్ హుడ్' టికెట్ ధరల పెంపు - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మూవీ టీం.. అసలు నిజం ఏంటో తెలుసా?
నితిన్ 'రాబిన్ హుడ్' టికెట్ ధరల పెంపు - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మూవీ టీం.. అసలు నిజం ఏంటో తెలుసా?
Telugu Travellar: ప్రపంచంలో ఈ 280 మంది ప్రత్యేకం  - వీరిలో మన రవి ఒకరు - ఇంతకీ ఏం చేశాడో తెలాసా ?
ప్రపంచంలో ఈ 280 మంది ప్రత్యేకం - వీరిలో మన రవి ఒకరు - ఇంతకీ ఏం చేశాడో తెలాసా ?
Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు - ఐలవ్‌యూ డేవిడ్ వార్నర్ అంటూ..
డేవిడ్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు - ఐలవ్‌యూ డేవిడ్ వార్నర్ అంటూ..
Embed widget