అన్వేషించండి

Janwada Farm House Case: జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ

Telangana News | తెలంగాణలో జన్వాడ ఫాం హౌస్ కేసు దుమారం రేపుతోంది. దర్యాప్తులో భాగంగా విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు విజయ్ మద్దూరికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

Janwada Farm House News: హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు చేయగా విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలిన విజయ్ మద్దూరికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. జన్వాడ ఫాం హౌస్ పార్టీలో పాల్గొన్న వారికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావటంతో మోకిల పోలీసులు NDPC సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలంగాణలో హాట్ టాపిక్‌గా జన్వాడ ఫాం హౌస్ కేసు 
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన జన్వాడ ఫాం హౌస్ పై పోలీసులు కొన్ని రోజుల కిందట (దీపావళి పండుగ సమయంలో) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ పెద్ద శబ్దాలు పెట్టి పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. విదేశీ మద్యం బాటిల్స్, కొన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీ సమయంలో అక్కడ కనిపించిన లిక్కర్ బాటిల్స్ వీడియో, ఫొటోలు వైరల్ కావడం తెలిసిందే. ఆ పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు నిర్వహించగా విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ గా వచ్చినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.

ఫ్యామిలీ పార్టీలో డ్రగ్స్ అంటూ కాంగ్రెస్ విమర్శలు

ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ గెట్ టుగేదర్ పేరుతో డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకోవడం ఏంటని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. పోలీసుల తనిఖీకి కొన్ని నిమిషాల ముందు కేటీఆర్ కుటుంబసభ్యులు సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారని సైతం కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో విపరీతంగా ప్రచారం జరిగింది. రేవంత్ ప్రభుత్వం మాత్రం డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని చెబుతోంది. ఇందులో ఎంత పెద్ద వాళ్లు ఉన్న వదిలిపెట్టేది లేదని, యువత జీవితాలు నాశనం అవుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో రాజ్ పాకాలకు చెందిన ఫాంహౌస్ లో జరిగిన పార్టీ రాజకీయాలకు కేంద్ర బిందువు అయింది.

 

రాజ్ పాకాలకు మొదట విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. రెండు రోజులు కనిపించకుండా పోయిన రాజ్ పాకాల నిర్ణీత గడువు సమయానికి మోకిల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్ తో కలిసి పీఎస్ కు వెళ్లిన రాజ్ పాకాల పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇటీవల విచారణకు హాజరైన విజయ్ మద్దూరి

మరోవైపు జన్వాడ ఫాం హౌస్ కేసులో ఏ2గా ఉన్న విజయ్ మద్దూరి సైతం ఇటీవల విచారణకు హాజరయ్యారు. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని, తెప్పించింది ఎవరు అనే కోణాల్లొ పోలీసులు విచారణ చేపట్టారు. రాజ్ పాకాల వాంగ్మూలం ఆధారంగానే ఆ తరువాత విచారణకు హాజరైన విజయ్ మద్దూరిని పోలీసులు విచారించారు. తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, తాను చెప్పని విషయాలను సైతం ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారని విచారణ అనంతరం విజయ్ మద్దూరి మీడియాకు తెలిపారు. దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండేందుకు దర్యాప్తులో భాగంగా విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
YSRCP Kannababu: పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
TV Movies: సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Bigg Boss Telugu Season 8: డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
Embed widget