Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
NBK Daaku Maharaaj: 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Daaku Maharaaj: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా 'డాకు మహారాజ్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం మూవీ డైరెక్టర్ బాబి నిర్మాత, నాగ వంశీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న పరిస్థితులు, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసే ఆలోచన, 'డాకు మహారాజ్' మూవీ ఎలా వచ్చింది? తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలింపు వెళ్లనుందా? వంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం చెప్పారు నాగ వంశీ.
'వాల్తేరు వీరయ్య' కంటే బెటర్...
తాజాగా ప్రెస్ మీట్ లో భాగంగా డైరెక్టర్ బాబీకి ఓ ప్రశ్న ఎదురయింది. ఓ విలేఖరి మాట్లాడుతూ..." మీరు చిరంజీవి అభిమాని కదా... బాలయ్యతో సినిమా చేయడం అనేది ఒక టాస్క్. పైగా ఏ మాత్రం తేడా వచ్చినా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. ఈ సినిమా ఎలా వచ్చింది?" అని ప్రశ్నించగా... వెంటనే నాగ వంశీ అందుకుని "ఆయన చిరంజీవి అభిమాని. నేను బాలయ్య అభిమానిని. బాలయ్య అభిమానిగా చెప్తున్నా వాల్తేరు వీరయ్య కంటే ఈ సినిమాను బాబి చాలా బాగా తీశాడు. చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు ఇదే నిజం" అంటూ చెప్పుకొచ్చారు.
నేను బాలకృష్ణ అభిమాని, చిరంజీవి సినీమా కంటే చాలా బాగా తీసారు దర్శకుడు - నాగ వంశీ#DakuMaharaj #Bobbykolli #NagaVamsi pic.twitter.com/2AVTlKoka3
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) December 23, 2024
ఆ తమిళ సినిమాలే టార్గెట్
బాలయ్య సినిమా అనగానే గుర్తొచ్చేది బోయపాటి. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ ను ఎవ్వరూ బీట్ చేయలేరు అనే టాక్ ఉంది. తాజాగా 'డాకు మహారాజ్' మూవీ 'అఖండ ' కంటే బాగుంటుందా? అని ప్రశ్నించగా... డైరెక్టర్ బాబి స్పందిస్తూ "అలా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. బోయపాటి బాలయ్యతో మూడు గొప్ప సినిమాలు తీశారు. బాగా తీశాడు, బాగా అప్డేట్ అయ్యాడు అని ట్రేడ్ అనుకోవాలనే ఆలోచన ఉంటుంది. అంతేతప్ప మిగతా డైరెక్టర్లు, హీరోలతో కంపేరిజన్ ఉండదు" అని రిప్లై ఇచ్చారు. అంతలోనే నాగ వంశీ అందుకుని "మేము అఖండ కాదు గానీ జైలర్, విక్రమ్ కంటే గొప్ప సినిమాలు తీయాలని అనుకుంటాము. అదే టార్గెట్" అంటూ సమాధానం ఇచ్చారు నాగ వంశీ.
మాకు #Akhanda కాదు.. #Jailer, #Vikram సినిమాలు టార్గెట్ #Bobby #NagaVamsi #DaakuMaharaaj #TelugFilmNagar pic.twitter.com/czfBhwoZ0F
— Telugu FilmNagar (@telugufilmnagar) December 23, 2024
పెయిడ్ ప్రీమియర్లు అవసరం లేదు
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పెయిడ్ ప్రీమియర్లను, బెనిఫిట్ షోలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి ప్రశ్నలు ఎదురు కాగా, నాగవంశీ స్పందిస్తూ "నిర్మాత, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రమోషన్లలో భాగంగా అమెరికాలో ఉన్నారు. ఆయన రాగానే సీఎంను కలిసి టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోల గురించి చర్చిస్తాము. అయితే సంక్రాంతి సినిమాలకి పెయిడ్ ప్రీమియర్లు అవసరం లేదు. కేవలం బడ్జెట్ ఎక్కువైన సినిమాలకు మాత్రమే టికెట్ పెంపు గురించి అడుగుతాము" అని అన్నారు నాగ వంశీ. అలాగే పవన్ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ మీటింగ్ లో ఆయన చెప్పినట్టే ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు సహకరిస్తుందని, టాలీవుడ్ ఏపీకి తరలి వెళ్లే ఛాన్స్ లేదని అన్నారు నాగ వంశీ. హైదరాబాద్ లో జనవరి 2 న ట్రైలర్, జనవరి 4న యూఎస్ లో సాంగ్ లాంచ్, ఆంధ్రాలో జనవరి 8న మంగళగిరి లేదా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాము అంటూ మూవీ ప్రమోషనల్ ప్లాన్స్ గురించి వెల్లడించారు.