అన్వేషించండి

Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్

Chattishgarh News: బాలీవుడ్ నటి సన్నీలియోని పేరిట ఓ ప్రబుద్ధుడు ఫేక్ ఖాతా సృష్టించి ప్రభుత్వ పథకం కింద డబ్బులు అందుకుంటున్నాడు. లబ్ధిదారుల్లో సన్నీలియోని పేరుండడాన్ని గుర్తించిన అధికారులు షాకయ్యారు.

Sunny Leone Got Thousand Rupees Under Chattisgarh Scheme: ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకానికి సంబంధించి లబ్ధిదారుల్లో బాలీవుడ్ నటి సన్నీలియోని (Sunny Leone) పేరు ఉండడంతో అధికారులు షాకయ్యారు. ఆమె పేరు మీద ఉన్న ఖాతాలోకి ప్రతి నెలా ప్రభుత్వం నుంచి రూ.1000 జమవుతున్నట్లు గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. ఓ వ్యక్తి దీని వెనుక ఉండి ఈ తతంగం నడిపించాడని గుర్తించారు. అసలు ఏం జరిగిందంటే..

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) ప్రభుత్వం 'మహతారీ వందన్ యోజన' (Mahatari Vandan Yojana) పథకం కింద రాష్ట్రంలోని వివాహిత మహిళలకు ప్రతీ నెలా వారి అకౌంట్లలో రూ.1000 జమ చేస్తోంది. అయితే, ఇటీవల అధికారులు మహిళల ఖాతాలను పరిశీలిస్తుండగా బాలీవుడ్ నటి సన్నీలియోని పేరుతో ఓ అకౌంట్‌ను చూసిన అధికారులు కంగుతిన్నారు. దీనిపై విచారణ చేయగా.. బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి నటి పేరుతో ఫేక్ బ్యాంక్ అకౌంట్ తెరిచి.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ప్రతీ నెలా ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి రూ.1000 లబ్ధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. గత మార్చి నెల నుంచి నగదు జమ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేశామని.. పథకంలో అర్హులైన లబ్ధిదారుల వెరిఫికేషన్‌కు బాధ్యులైన అధికారులను కూడా విచారిస్తున్నామని వెల్లడించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని సదరు బ్యాంక్ అకౌంట్‌ను సీజ్ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు. ఇప్పటివరకూ జమ అయిన మొత్తాన్ని నిందితుని నుంచి వసూలు చేయాలని స్పష్టం చేశారు.

బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు

మరోవైపు, ఈ ఘటనపై విపక్ష కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో మహతారీ వందన్ యోజన కింద 50 శాతం మంది లబ్ధిదారుల ఖాతాల ఫేక్‌వేనని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దీపక్ బైజ్ ఆరోపించారు. అయితే, ఈ విమర్శలను డిప్యూటీ సీఎం అరుణ్ సావో తిప్పికొట్టారు. కాంగ్రెస్ హయాంలో అందించని సాయం ఇప్పుడు రాష్ట్ర మహిళలు అందుకుంటున్నారని.. దీంతో ఆ పార్టీ ఓర్వలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితునిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: Chenab Rail Bridge: కాశ్మీర్ లోయలో రైల్వే ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన "చినాబ్ రైల్ బ్రిడ్జ్ " విశేషాలివే

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
Viral Video: అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget