అన్వేషించండి

Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 

చల్లగా ఉండే యూరప్ ఖండం ఇప్పుడు ఓవెన్‌లా ఎందుకు మండుతోంది? గ్లోబల్ క్లైమేట్ హాట్‌స్పాట్‌గా మారడం వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలు ఏెంటి..? యూరోప్ సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటికీ ఏ ప్రమాద సంకేతం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూరోప్ తీవ్ర వేడిగాలులతో, ప్రపంచ సగటుకు రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది.
  • జెట్ స్ట్రీమ్ మార్పులు, ఆర్కిటిక్ వేడిమి యూరోప్‌లో తీవ్రత పెంచుతున్నాయి.
  • రవాణా, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిని, ప్రజల దైనందిన జీవితం ప్రభావితమైంది.
  • శాస్త్రవేత్తల ప్రకారం, ప్రస్తుత పరిస్థితి భయంకరమైన భవిష్యత్తుకు సూచన.

Climate Change in Europe: యూరోప్ అల్లాడిపోతోంది. ప్రపంచ వేసవి విడిది అని పేరున్న ఆ ఖండం.. వేడి ధాటిని తట్టుకోలేకపోతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని వేసవి కాలం,  సుందర ప్రకృతి దృశ్యాలు.. ఆల్ఫ్ పర్వతాల అందాలు ఇదీ యూరోప్ గురించి అందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నరజలు.. ఎండలకు పిట్టల్లా రాలుతున్న ప్రాణాలు.. వేడికి అల్లాడుతున్న దేశాలు... ఇదీ ఇప్పుడు పరిస్థితి. యూరోప్ ఇప్పుడు వేగంగా ఒక గ్లోబల్ క్లైమేట్ హాట్‌స్పాట్‌గా మారుతోంది. మధ్యధరా సముద్రం మీద నుంచి ఉత్తర మైదానాల వరకూ ఇప్పుడు వేసవి విడిది కాదు. అదొక వాతావరణ అత్యయిక స్థితి..!

భూమిపై అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండం యూరోప్

మీకు తెలుసా. యూరోపియన్ ద్వీపకల్పమే ఇప్పుడు భూమిమీద అత్యధికంగా వేడెక్కుతున్న ప్రాంతం. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) మరియు వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ (WMO) డేటా ఒక చేదు నిజాన్ని నిర్ధారిస్తోంది:  పారిశ్రామిక విప్లవానికి ముందుతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్టోగ్రత పెరుగుదల 1.21.2°C నుండి 1.3°C ఉంటే..  యూరప్ సగటు పెరుగుదల:    2.3°C నుండి 2.4°C వరకూ ఉంది.  యూరప్‌లో హీట్‌వేవ్స్‌ అంటే  ఎప్పుడో ఒకసారి వచ్చే అరుదైన సంఘటనలు అనుకునేవారు.  2003లో వచ్చిన హీట్‌వేవ్ వల్ల ఖండం అంతటా 70,000 కంటే ఎక్కువ మంది మరణించారు, అప్పట్లో దాన్ని శతాబ్దానికి ఒకసారి వచ్చే విపత్తుగా భావించారు. కానీ ఈరోజు, ఆ అసాధారణ ఉష్ణోగ్రతలే సాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు జూలై నెలలో కాస్త వెచ్చగా ఉండే రోజులు.. ఇప్పుడు సబ్‌ట్రోపికల్ ఎయిర్ మాసెస్ (ఉప-ఉష్ణమండల వాయు ద్రవ్యరాశి) కారణంగా వారాల తరబడి కదలకుండా ఉండిపోతున్నాయి.

యూరప్ ఊహించిన దానికంటే వేగంగా ఎందుకు వేడెక్కుతోంది? (Why Europe Is Heating Faster)?

యూరప్ ఇంత వేగంగా వేడెక్కడం ప్రారంభంలో వాతావరణ నమూనాలను  సైతం ఆశ్చర్యపరిచింది. అయితే శాస్త్రవేత్తలు దీని వెనుక ఉన్న నిర్దిష్టమైన కారణాలను కనుగొన్నారు.
 
గ్రీన్‌హౌస్ వాయువులు:  ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రియలైజేషన్ ప్రభావం ఉంది. గ్రీన్‌ హౌస్ ఉద్గారాలు ఎక్కువుగా వచ్చే పరిశ్రమలు యూరోప్‌లో తక్కువే. కానీ..  గ్రీన్‌ హౌస్ హౌస్ ప్రభావం మాత్రం యూరోప్‌ మీద ఎక్కువుగా ఉంది. ఎందుకంటే ప్రపంచమంతా ఓ వేడి దుప్పటిలా వ్యాపించిన ఈ వాయువుల వ్యాప్తి అన్ని చోట్ల సమానంగా లేదు. యూరప్ ఉన్న భౌగోళిక స్థానం వల్ల ఈ ఉష్ణోగ్రత మార్పులకు ఇది ఎక్కువగా గురవుతోంది.

 ఆర్క్టిక్ యాంప్లిఫికేషన్ (Arctic Amplification): ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ ప్రాంతం ప్రపంచ సగటు కంటే దాదాపు నాలుగు రెట్లు వేగంగా వేడెక్కుతోంది. ఆర్క్టిక్ సముద్రపు మంచు కరిగేకొద్దీ, అది తెల్లటి మంచుకు బదులుగా ముదురు రంగులో ఉండే సముద్రపు నీటిని బయటకు తీస్తుంది. ఈ నీరు సూర్యరశ్మిని అంతరిక్షంలోకి రిఫ్లెక్ట్‌ చేయకుండా Absorb చేస్తోంది. యూరోప్ నార్త్ పోల్‌కు దగ్గరగా ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కువుగా ఉంటోంది.  భూమధ్యరేఖకు మరియు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న ఉష్ణోగ్రత వ్యత్యాసం గణనీయంగా తగ్గుతోంది.

 జెట్ స్ట్రీమ్ బలహీనపడటం (Jet Stream Changes): ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం తగ్గడం వల్ల 'పోలార్ జెట్ స్ట్రీమ్' (ఉత్తర అర్ధగోళంలో వాతావరణాన్ని శాసించే అధిక ఎత్తులో వేగంగా ప్రవహించే గాలి) అస్థిరంగా మారింది. జెట్ స్ట్రీమ్ వేగం తగ్గినప్పుడు, అది వంకరగా మారి ఒకే చోట నిలిచిపోతుంది. మరీ ముఖ్యంగా, యూరప్ మీదుగా "జెట్ స్ప్లిటింగ్" (గాలి రెండు పాయలుగా చీలడం) జరుగుతోందని శాస్త్రవేత్తలు గమనించారు. ఈ చీలిక వల్ల పశ్చిమ మరియు మధ్య యూరప్ మీదుగా గాలి కదలికలు లేని ఒక నిశ్చల ప్రాంతం ఏర్పడుతుంది. ఈ నిశ్చలత వేడి గాలిని వారాల తరబడి ఒకే చోట బంధిస్తుంది.

హై-ప్రెషర్ సిస్టమ్స్- హీట్ డోమ్స్ (Heat Domes): బలహీనపడిన జెట్ స్ట్రీమ్ వల్ల, అధిక పీడన వ్యవస్థలు (High-pressure systems) యూరప్ భూభాగాలపై నిలిచిపోతాయి. ఈ వ్యవస్థలు ఒక పెద్ద హీట్ డోమ్ లా పనిచేస్తాయి. అధిక పీడనం గాలిని భూ ఉపరితలం వైపు నెట్టడం వల్ల, గాలి కుదించబడి థర్మోడైనమిక్‌గా వేడెక్కుతుంది. అంతేకాకుండా, ఈ హీట్ డోమ్ మేఘాలను వర్షాన్ని ఇచ్చే వాతావరణ వ్యవస్థలను దరిచేరనివ్వదు.మేఘాలు లేకపోవడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుంది. 

మెడిటరేనియన్ సముద్రం వేడెక్కడం (Mediterranean Sea Warming): మధ్యధరా సముద్రం ప్రపంచ మహాసముద్రాల సగటు కంటే చాలా ఎక్కువ రేటుతో వేడెక్కుతోంది. వేసవి ప్రారంభంలో, ఈ సముద్రం ఒక భారీ ఉష్ణ నిధిలా పనిచేస్తుంది. ఇది దక్షిణ యూరప్ తీర దేశాలను చల్లబరచడానికి బదులుగా, చుట్టుపక్కల గాలిలోకి విపరీతమైన వేడిని  తేమను విడుదల చేస్తుంది. ఇది రాత్రి వేళల్లో కూడా వాతావరణం చల్లబడకుండా అడ్డుకుంటూ స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలలో హీట్‌వేవ్‌లను మరింత తీవ్రతరం చేస్తోంది.

ఈ ఏడాది వేడి ఇంత దారుణంగా ఎందుకంటే..

  • శీతాకాలంలో ఆల్ప్స్ పర్వతాలలో తక్కువ మంచు కురవడం, వర్షాలు లేకపోవడం వల్ల దక్షిణ మరియు మధ్య యూరప్ ముందే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంది.
  • సూర్యరశ్మి తడి నేలపై పడినప్పుడు, ఆ శక్తిలో చాలా భాగం నీటిని ఆవిరి చేయడానికి (Latent Heat) ఖర్చవుతుంది. కానీ నేల పూర్తిగా ఎండిపోయినప్పుడు, సూర్యశక్తి 100% నేరుగా భూమిని  దాని పైన ఉన్న గాలిని వేడి చేయడానికి (Sensible Heat) ఉపయోగపడుతుంది. ఈ ఏడాది ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలలో ఎండిపోయిన నేలలు ఈ దుష్ట వలయాన్ని సృష్టించి, వేడి తీవ్రతను రెట్టింపు చేశాయి.
  •  నార్త్ అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వెచ్చని సముద్ర ఉపరితలం.. గతంలో పశ్చిమ యూరప్‌ను చల్లబరిచే చల్లని సముద్ర గాలులను రానివ్వకుండా అడ్డుకుంటోంది.
  •  ప్రపంచ స్థాయిలో, శక్తివంతమైన ఎల్ నినో (El Niño) చక్రం వాతావరణంలో మిగిల్చిన అదనపు వేడి కూడా ఈ ప్రాంతీయ ఉష్ణోగ్రతలు ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టడానికి ఒక బేస్‌లైన్‌గా పనిచేసింది                                                                                                                                                                                                                                                                                                               దారుణంగా ప్రభావితమైన  యూరోప్

యూరోప్ దేశాలు ఈ ఆధునిక తరం చూడనటువంటి ఘోర వాతావరణ పరిస్థితును అనుభవిస్తున్నాయి. మన దగ్గర 45 డిగ్రీలు అంటే మామూలే కానీ యూరోప్‌లో ఊహించగలమా.. కానీ స్పెయిన్‌లో 45డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్రిడ్‌లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పోర్చ్‌గల్‌ అయితే 44 డిగ్రీలతో మండిపోతోంది. రోడ్లమీద షవర్లు ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్‌లో క్లైమేట్ ఎమర్జెన్సీ విధించారు. దాదాపుగా వెయ్యిమంది వృద్ధులు ఫ్రాన్స్‌లో చనిపోయినట్లు అంచనా. ఇటలీ, జర్మనీ, గ్రీస్ అన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నవే. UKలో అయితే రైలు సర్వీసులు నిలిపేశారు. నీటి వినియోగంపై నిషేధం పెట్టారు. 

దెబ్బతిన్న రవాణా వ్యవస్థ

ఈ వాతావరణ మార్పులు ఆహార ఉత్పత్తులు పారిశ్రామికీకరణపై ప్రభావం చూపడం చూస్తూనే ఉంటాం. తుపాన్లు, వరదలు, మంచు వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతింటం వింటాం. కానీ వేడి వల్ల యూరోప్‌లో రవాణా వ్యవస్థ దెబ్బతింది తెలుసా..? యూరప్ రైల్వే నెట్‌వర్క్‌లు కాంక్రీట్ స్లీపర్లపై అమర్చిన వెల్డెడ్ పట్టాలను ఉపయోగిస్తాయి. ఇవి సాధారణంగా గరిష్టంగా డిగ్రీల ఉష్ణాన్ని తట్టుకోగలుగుతాయి. కానీ గాలి ఉష్ణోగ్రత 40 దాటితో పట్టాల ఉష్ణోగ్రత 52 డిగ్రీలకు చేరుతోంది. దీంతో అవి వ్యాకోచిస్తున్నాయి. పట్టాలు వంకరగా అయిపోతుండటంతో ప్రమాదకర స్థాయి వచ్చేసింది. వేడి గాలికి సాంద్రత (Density) తక్కువగా ఉంటుంది. ఇది విమాన ఇంజిన్ల థ్రస్ట్ , రెక్కల లిఫ్ట్ (పైకి లేచే శక్తి)ని తగ్గిస్తుంది. దీనివల్ల దక్షిణ యూరప్ విమానాశ్రయాలలో రన్‌వే పొడవును బట్టి విమానాలు సురక్షితంగా టేకాఫ్ కావడానికి ప్రయాణీకులను.. కార్గోను తగ్గించాల్సి వస్తోంది. శీతల వాతావరణం కారణంగా యూరోప్‌ మెట్రో స్టేషన్లలో ఏసీలు ఉండవు. కానీ  ఈవేడి వాతావరణంలో అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో ప్రజలు అగచాట్లు పడుతున్నారు. 

ఎండుతున్న నదులు... ఆగిపోయిన విద్యుత్ 

యూరోప్‌లో విద్యుత్‌ కు నదులలో నీటికి సంబంధం ఉంది. అణువిద్యుత్ టర్బైన్లను చల్లబరచడానికి నదుల నీటిని వాడుతారు. అయితే వాటిలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో జలచరాలను కాపాడటానికి ఓ పరిమితికి మించి నీటిని విద్యుత్ కేంద్రాలకు పంపరు. ఇప్పుడు వాటిలో నీరు తగ్గడంతో విద్యుత్ ప్లాంట్లకు నీరు ఆగిపోయింది. దాని వల్ల ఉత్పత్తి తగ్గింది.ఇంకో వైపు వేడి తట్టుకోలేక జనాలు ఏసీలు కొని వాడుతున్నారు. సాధారణంగా యూరోప్‌లో ఏసీల వాడకం తక్కువ .దీంతో గ్రిడ్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది. 

చాలా దేశాలు తమ రోజువారీ కార్యకలాపాలను మార్చుకుంటున్నాయి. పనివేళలను తెల్లవారు జాముకు మార్చారు. మధ్యాహ్నం పూట ఆఫీసులకు సెలవులు ఇచ్చారు. యూరోప్‌ పర్యాటకం తగ్గిపోయింది. బారిసోలనా వంటి చోట్ల మళ్లీ పాతపద్దతిలో రోడ్లు ( రోడ్డుపై భారీ వృక్షాలు పెంచడం) వంటి వాటివైపు వెళుతున్నారు. పారిస్ వంటి నగరాల్లో "కూల్ పాత్స్" (చల్లని మార్గాలు) మ్యాప్ చేసి, ప్రజల కోసం పార్కులను 24 గంటలు తెరిచి ఉంచుతున్నారు.

 శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరికలు 

IPCC, WMO, కోపర్నికస్ మరియు యూరప్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ వంటి ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తల అభిప్రాయం ఒక్కటే: యూరప్ ప్రస్తుత వాతావరణం తాత్కాలికమైనది కాదు, ఇది మరింత భయంకరమైన భవిష్యత్తుకు ముందస్తు సూచన.  "యూరప్ ప్రపంచ సగటు కంటే రెండింతలు వేగంగా వేడెక్కుతోంది మరియు ఈ ధోరణి మరింత పెరుగుతోంది. ఉద్గారాలను వెంటనే తగ్గించకపోతే  నగరాలను మార్చకపోతే.. ఈరోజు మనం చూస్తున్న హీట్‌వేవ్‌లే భవిష్యత్తులో సాధారణ వేసవి కాలాలుగా మారుతాయి." అని కొపర్నికస్ క్లైమోటికల్ సర్వీసస్ ప్రకటించింది. 

యూరప్ ఒక ప్రెషర్ కుక్కర్‌లా మారడం అనేది భవిష్యత్తులో వచ్చే సమస్య కాదు; అది ప్రస్తుతం జరుగుతున్న నిఖార్సైన నిజం. మానవ తప్పిదాల వల్ల వస్తున్న వాతావరణ మార్పులు యూరప్ వాతావరణాన్ని శాశ్వతంగా మార్చేశాయని సైన్స్ స్పష్టం చేస్తోంది. చారిత్రక నగరాలు వేడికి తలవొగ్గుతున్న వేళ, విద్యుత్ గ్రిడ్‌లు కుప్పకూలుతున్న వేళ.. ఈ సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటికీ ఒక హెచ్చరిక. సంపద కానీ, అత్యాధునిక సాంకేతికత కానీ ప్రకృతి సృష్టించే థర్మోడైనమిక్ శక్తుల ముందు నిలవలేవు. యూరప్ భవిష్యత్తు.. తను సృష్టించుకున్న ఈ కొత్త వేడి వాతావరణానికి ఎంత వేగంగా అలవాటు పడుతుందనే దానిపైనే ఆధారపడి ఉంది.

Frequently Asked Questions

యూరప్ ప్రస్తుతం ఎలాంటి వాతావరణాన్ని ఎదుర్కొంటోంది?

యూరప్ ప్రస్తుతం తీవ్రమైన వేడిగాలులు, ఎండిపోయిన నదులు, దెబ్బతిన్న రవాణా వ్యవస్థలతో వాతావరణ అత్యవసర స్థితిని ఎదుర్కొంటోంది. ప్రపంచ వేసవి విడిదిగా పేరున్న ఈ ఖండం, వేడిని తట్టుకోలేకపోతోంది.

యూరప్ ప్రపంచ సగటు కంటే వేగంగా ఎందుకు వేడెక్కుతోంది?

ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్, జెట్ స్ట్రీమ్ బలహీనపడటం, హీట్ డోమ్స్ మరియు మధ్యధరా సముద్రం వేడెక్కడం యూరప్ వేగంగా వేడెక్కడానికి ప్రధాన కారణాలు. ఇది ప్రపంచ సగటు కంటే రెండింతలు వేగంగా వేడెక్కుతోంది.

యూరప్‌లోని వేడి వాతావరణం రవాణా మరియు విద్యుత్ వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తోంది?

వేడి కారణంగా రైలు పట్టాలు వ్యాకోచిస్తున్నాయి, విమానాల టేకాఫ్ కోసం ప్రయాణికులను తగ్గించాల్సి వస్తోంది. నదులలో నీటి నిల్వలు తగ్గడంతో అణు విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి ఆగిపోతోంది.

యూరప్‌లో ప్రస్తుత వాతావరణ మార్పుల గురించి శాస్త్రవేత్తలు ఏమి హెచ్చరిస్తున్నారు?

యూరప్ ప్రస్తుత వాతావరణం తాత్కాలికం కాదని, భయంకరమైన భవిష్యత్తుకు సూచన అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉద్గారాలు తగ్గకపోతే నేటి హీట్‌వేవ్‌లే సాధారణ వేసవి కాలాలుగా మారతాయంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Marco Rubio India Visit: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన.. వ్యాపారం, ఇంధనం, దౌత్యపరమైన 5 కీలక అంశాలు
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన.. వ్యాపారం, ఇంధనం, దౌత్యపరమైన 5 కీలక అంశాలు
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget