సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!
Hyderabad CP CV Anand Fires on National Media | సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట మహిళ మృతి కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఆరోజు ఏం జరిగిందో పోలీసులు కొన్ని వీడియోలు విడుదల చేసి స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో మీడియా సీవీ ఆనంద్‌ను కొన్ని విషయాలు ప్రశ్నించగా.. నేషనల్ మీడియాను కొనేశారు. అందుకే అక్కడ వార్తలు అలా ప్రచారం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నిజంగానే నేషనల్ మీడియాకు డబ్బులు ఇచ్చారా, అందుకు మీతో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని సీవీ ఆనంద్ పై అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. దాంతో దిగొచ్చిన ఐపీఎస్ సీవీ ఆనంద్ తమ మాటలు వెనక్కి తీసుకున్నారు. జాతీయ మీడియాపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు.





















