బోట్ రైడింగ్ అంటే ఇష్టమా! కృష్ణా నదిపై 2 లాంచీ సేవలు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం పర్యాటకులకు శుభవార్త చెప్పింది. రెండు లాంచీ (క్రూయిజ్) సేవ‌లు ప్రారంభించింది.

కొండల మధ్యలో కృష్ణా నది పరుగులు పెడుతుంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ లాంచీలో ఎంచక్కా ప్రయాణం చేయవచ్చు

తెలంగాణ టూరిజం శాఖ నాగ‌ర్జున సాగ‌ర్ - శ్రీశైలం మార్గంలో లాంచీ సేవల్ని నవంబర్ 2న ప్రారంభించింది

తెలంగాణ టూరిజం శాఖ సోమశిల నుంచి శ్రీశైలం మార్గంలో సైతం లాంచీ (క్రూయిజ్) సేవలు అందుబాటులోకి తెచ్చింది

నందికొండ, ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమల మీదుగా 120కి.మీ ప్రయాణం పర్యాటకులను కనువిందు చేయనుంది

లాంచీలో సింగిల్‌ జర్నీలో పెద్దల‌కు రూ.2000, చిన్నారులకు టికెట్ ధర రూ.1,600 గా నిర్ణయించారు.

లాంచీలో రౌండప్ (రానుపోను) జర్నీలో పెద్దల‌కు టికెట్ రూ.3,000, పిల్లలకు రూ.2,400 టికెట్ ధర ఉంది.

సోమశిల నుంచి శ్రీశైలానికి, నాగ‌ర్జున సాగ‌ర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.