రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శనివారం కేబినెట్ భేటీ జరిగింది. పలు అంశాలపై మంత్రులు చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. సన్న వడ్లకు సైతం రూ.500 బోనస్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్శిటీకి ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయించాలని మంత్రివర్గం చర్చించింది

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తెలంగాణ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మద్దూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడంతో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపుపైనా నిర్ణయం

రియల్ ఎస్టేట్ నియంత్రణ & అభివృద్ధి (RERA)లో 54 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీకి అనుమతి ఇచ్చారు

ఉస్మానియా హాస్పిటల్ పునర్ నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం