Watch Video: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రక్రియ వేడుకగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్‌లో భారీ క్రేన్‌తో భారీ గణపయ్యను నిమజ్జనం చేశారు. వినాయక చతుర్థి నుంచి 70 అడుగుల ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి భక్తుల పూజలందుకుని ఆశీస్సులు అందించాడు సెప్టెంబర్ 17న ఉదయం ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా అనుకున్న టైమ్‌కు మహాగణపతి హుస్సేన్ సాగర్ చేరుకున్నాడు 70 అడుగుల ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని ఎన్టీఆర్ మార్గ్‌లో సూపర్ క్రేన్ ద్వారా గంగమ్మ చెంతకు చేర్చారు ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఏడాది సైతం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం వేడుకలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ ఖైరతాబాద్ గణేష్ ను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు రాత్రి 2 గంటల వరకు హైదరాబాద్ లో మెట్రో నడుస్తుంది. చివరి మెట్రో రాత్రి 1కి స్టార్ట్ అవుతుంది