తెలంగాణ తల్లి విగ్రహం అనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు

తెలంగాణ సచివాలయం ఎదుట దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 16న ఆవిష్కరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంది

తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం లోపల ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు

గత పదేళ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుకురాలేదా అని కేసీఆర్, బీఆర్ఎస్ నేతల్ని రేవంత్ ప్రశ్నించారు

18 ఏళ్లకే యువతకు ఓటు హక్కుతో పాటు దేశంలో కొత్త టెక్నాలజీకి రాజీవ్ గాంధీ నాంది పలికారని చెప్పారు

ఇది ముమ్మాటికీ రాజకీయ వేదిక కాదని, రాజీవ్ గాంధీ విగ్రహంపై రాజకీయాలు వద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి

తాము అధికారంలోకి వచ్చాక, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు