ఇంటికి వచ్చిన వెంటనే కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న కవిత సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత మంగళవారం రాత్రి ఢిల్లీలోనే బస చేశారు బుధవారం ఉదయం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు కవిత, కేటీఆర్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు రాఖీ కట్టిన వెంటనే సోదరుడు కేటీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు కవిత సోదరి కవితకు ఎల్లప్పుడూ అండగా ఉంటానంటూ ఆమె వెన్నుతట్టారు మాజీ మంత్రి కేటీఆర్ ఐదు నెలల తరువాత ఇంటికి రావడంతో తల్లిని చూసి కవిత భావోద్వేగానికి లోనయ్యారు చాలా రోజుల తరువాత బిడ్డ కవితను చూసిన తల్లి శోభకు ప్రాణం మళ్లీ లేచొచ్చినట్లు అనిపించింది