హైదరాబాద్‌లో తప్పని మరో కుండపోత వర్షం, ఆ ఏరియాల్లో జాగ్రత్త గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం వేకువజామున, సాయంత్రం కురిసిన వర్షాలకు హైదరాబాద్ ప్రజలు అల్లాడిపోయారు రాత్రి హయత్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, బోడుప్పల్ లకు భారీ వర్ష సూచన ఉంది రాత్రి తూర్పు హైదరాబాద్ ఏరియాలలో వర్షం దంచికొట్టనుందన్న వాతావరణ శాఖ నేటి రాత్రి రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురవనుంది హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా, ప్రస్తుతం 513 మీటర్లకు చేరింది శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, బాచుపల్లి సహా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో తప్పని ఇబ్బందులు